అప్పుడు మిస్సైనా ఈ జోడీ ఇప్పుడు కుదిరింది..!
ప్రియదర్శి లీడ్ రోల్ లో వచ్చిన లూజర్ వెబ్ సీరీస్ ను అభిలాష్ రెడ్డి హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం తన 35వ సినిమా చేస్తున్న శర్వానంద్ ఆ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి లాస్ట్ ఇయర్ సామజవరగమన లాంటి సూపర్ హిట్ కొట్టిన రాం అబ్బరాజు డైరెక్షన్ లో మూవీ కాగా.. మరొకటి లూజర్ వెబ్ సీరీస్ తో డైరెక్టర్ గా ప్రతిభ చాటిన అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రియదర్శి లీడ్ రోల్ లో వచ్చిన లూజర్ వెబ్ సీరీస్ ను అభిలాష్ రెడ్డి హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఆ సీరీస్ రిలీజ్ టైం లోనే అతనికి సినిమా ఆఫర్లు వచ్చాయని అన్నారు కానీ ఆ తర్వాత అప్డేట్స్ రాలేదు.
ఫైనల్ గా శర్వానంద్ తో అభిలాష్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. యువి బ్యానర్ లో శర్వానంద్ కాంబో అంటే అది పక్కా హిట్ టార్గెట్ తో వస్తుంది. యువితో చేసిన శర్వానంద్ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నారని తెలుస్తుంది. మహానటి కీర్తి సురేష్ తెలుగులో దసరా తర్వాత చేస్తున్న సినిమా ఇదే.
ఐతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంతకుముందే కీర్తి సురేష్ తో శర్వానంద్ జత కట్టాల్సి ఉంది. శర్వా హీరోగా నటించిన శ్రీకారం సినిమా లోనే ముందు కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నారు. దాదాపు ఆమె కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పిందట. కానీ ఆల్రెడీ ఆమె డేట్స్ ఫుల్ అవ్వడం వల్ల ఆ టైం లో శర్వానంద్ తో చేయడం కుదరలేదు. 3 ఏళ్ల క్రితం వచ్చిన శ్రీకారం సినిమాలో శర్వానంద్, కీర్తి సురేష్ చేయాల్సి ఉన్నా అప్పుడు ఈ జోడీ కలిసి నటించడం కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు.
శర్వానంద్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. కచ్చితంగా శర్వా సినిమాలో కీర్తి పాత్ర కూడా హైలెట్ అవుతుందని చెప్పొచ్చు. శర్వానంద్ 35వ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ ని శ్రీరామ్ ఆదిర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తుంది. తన సినిమాలతో ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్న శర్వానంద్ వరుసగా క్రేజీ హీరోయిన్స్ తో జత కడుతున్నాడని చెప్పొచ్చు. దసరా తర్వాత కీర్తి సురేష్ కి ఇదొక మంచి ఛాన్స్ కాగా.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టికి శర్వానంద్ సినిమా మంచి అవకాశమని చెప్పొచ్చు.