కల్కి కోసం న్యూవరల్డ్.. టైమ్ లైన్ కు రీజన్ ఇదే: నాగ్ అశ్విన్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ జరుగుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా నాగ్ అశ్విన్.. బాంబే ఐఐటీలో జరిగిన టెక్ ఫెస్ట్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్కి మూవీ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించామని నాగ్ అశ్విన్ తెలిపారు. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుందని వెల్లడించారు. Q&Aలో కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
"కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. కల్కిలో భారత భవిష్యత్తు నగరాలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు. కల్కి కోసం దాదాపు ఐదేళ్లుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా ఆలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ను బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను" అని నాగ్ అశ్విన్ తెలిపారు.
"ఈ సినిమా కోసం కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీమ్ అంతా కలసి చాలా డిజైన్ వర్క్ చేశారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ అలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం ఉంది" అని కల్కి డైరెక్టర్ చెప్పారు.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె పాత్రల గురించి అడగ్గా.. "వారి పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు. అయితే అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు , దీపికా పదుకొణె.. వీళ్ల అభిమానులంతా అమితంగా ఆనందపడే పాత్రల్లో వారు కనిపిస్తారు. ఇదివరకూ ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో వారు కనిపించలేదు. తప్పకుండా ఫ్యాన్స్ ను అలరిస్తారు.వారంతా గ్రేట్ యాక్టర్స్. చాలా హంబుల్ గా వుంటారు. వారికి సినిమా అంటే ప్రేమ, ఇష్టం. వీరిలో వుండే సిమిలర్ క్యాలిటీ ఇది. " అని తెలిపారు.
"కల్కికి ‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడం వెనుక ఒక లాజిక్ ఉంది. అయితే అది సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న సమయంలో చెబుతాను. ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇచ్చే కొద్దిమంది కంపోజర్స్ లో సంతోశ్ నారాయణ్ ఒకరు. అందుకే ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశాం. ఈ మూవీలో ఫ్యూచర్ ప్రభాస్ ను చూస్తారు" అని చెప్పారు.
ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతోంది సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. అశ్వనీదత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు ప్రపంచవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.