ఈ తెలుగు భామ‌లు స్టార్ హీరోయిన్లు అయ్యేనా!

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల నామ స్మర‌ణ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే.

Update: 2023-08-09 02:45 GMT

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల నామ స్మర‌ణ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే.` బేబి` విజ‌యంతో వైష్ణ‌వి చైత‌న్య రాక‌తో తెలుగు అమ్మాయిల ఎంట్రీ విష‌యంలో పెద్ద చ‌ర్చే సాగిన వైనం విధిత‌మే. మెగా క్యాంప్ అంతా తెలుగు అమ్మాయిల్ని ప్రోత్స‌హించాల‌ని ఘ‌టా ప‌దంగా చెప్పింది. కొంత మంది ద‌ర్శ‌కులు.. సాంకేతిక నిపుణులు కూడా తెలుగు అమ్మాయిల ప‌ట్ల సానుభూతిని ప్ర‌ద‌ర్శించారు. మ‌రి ఈ సానుబూతులు..ఇచ్చిన భ‌రోసాలు ఎంత‌వ‌ర‌కూ నిల‌బ‌డ‌తాయో చూడాలి.

ప్ర‌స్తుతం న‌లుగు రైదుగురు తెలుగు హీరోయిన్లు ఇండ‌స్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. వారే అన‌న్య నాగ‌ళ్ల ...డింపుల్ హ‌య‌తి...ప్ర‌ణ‌వి ..వైష్ణ‌వి చైత‌న్య‌. తెలంగాణ అమ్మాయిగా ఫేమ‌స్ అయిన అన‌న్య షార్ట్ ఫిలింస్ ద్వారా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. `మ‌ల్లేశం` సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌యమైంది. ఆ త‌ర్వాత `వ‌కీల్ సాబ్` స‌హా నాలుగైదు సినిమాలు చేసింది. వ‌కీల్ సాబ్ తో కాస్త పాపుల‌ర్ అయింది. కానీ అమ్మ‌డికి ఇంకా స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు.

హీరోయిన్ గా రాణించాలి అనుకుంటున్న అమ్మ‌డికి స‌రైన అవ‌కాశం కూడా రాలేదు. ఆ ఛాన్స్ ఎప్పుడొ స్తుందా? అని ఎదురు చూస్తుంది. ఇక విజ‌య‌వాడ బ్యూటీ డింపుల్ హ‌య‌తి `గ‌ల్ప్` అనే చిన్న సినిమాతో ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత `గద్ద‌ల కొండ గ‌ణేష్`..`ఆత్రాంగి రే`లాంటి పాపుల‌ర్ చిత్రాల్లోనూ న‌టించింది. త‌మిళ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇలా సాగిపోతున్న డింపుల్ కి ఒక్క సారిగా మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన `ఖిలాడీ` సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది.

ఈ అవ‌కాశం తో టాలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయింది. చిన్న సినిమాతో ప‌రిచ‌య‌మైన బ్యూటీకి ఇంత పెద్ద అవ‌కాశం ఎలా అని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ త‌ర్వాత గోపీచంద్ హీరోగా న‌టించిన `రామ‌బాణం` లోనూ న‌టించింది. కానీ ఈ రెండు సినిమాలు ప‌రాజ‌యం చెంద‌డంతో డింపుల్ శ్ర‌మంతా వృద్ధా ప్ర‌య‌త్నంగానే మిగిలిపోయింది. రెండు పెద్ద అవ‌కాశాలు వ‌చ్చినా అమ్మ‌డికి టైమ్ క‌లిసి రాలేదు. మ‌ళ్లీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంది.

ఇక` బేబి` బ్యూటీ వైష్ణ‌వి గురించి తెలిసిందే. యూ ట్యూబ‌ర్ గా ప్రారంభ‌మై బేబితో ఫేమ‌స్ అయింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమా మంచి విజ‌యం సాధించింది. మరి కొత్త అవ‌కాశాలు అందుకుని బిజీ న‌టిగా మారుతుందా? అన్న‌ది చూడాలి. ఇక `స్ల‌మ్ డాగ్ హ‌జ్బెండ్` అనే సినిమాతో ప్ర‌ణ‌వి అనే తెలుగు అమ్మాయి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు వాళ్లు ప్రోత్స‌హిస్తారు అనే న‌మ్మ‌కంతో ఎంట‌ర్ అయింది. మ‌రి ఈ బ్యూటీ న‌మ్మ‌కం నిల‌బ‌డుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News