ది వ్యాక్సిన్ వార్.. ఎవరు పట్టించుకోవట్లే?
అస్సలు ఏ మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదని తెలుస్తోంది.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమా కంటే ముందుగా వివేక్ బాలీవుడ్ లో చాలా మూవీస్ చేసిన వాటితో రాని గుర్తింపు ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో వచ్చింది. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది.
తాజాగా ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడి నుంచి థియేటర్స్ లోకి వస్తోన్న సినిమా ది వ్యాక్సిన్ వార్. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ఇండియన్ శాస్త్రవేత్తలు ఎలాంటి కృషి చేశారు అనేది ఈ కథలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బలమైన ఎమోషన్స్ తో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మూవీ ట్రైలర్ కూడా అందరికి కనెక్ట్ అయ్యింది. సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది.
అయితే సడెన్ గా ఏమైందో సినిమా ప్రమోషన్ పూర్తిగా తగ్గిపోయింది. నానా పటేకర్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్న కూడా సినిమా పట్ల ఆడియన్స్ అంత ఆసక్తి చూపించడం లేదు. దీనికి నిదర్శనంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి.
అస్సలు ఏ మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదని తెలుస్తోంది. ప్రేక్షకులు ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని మొదటి రోజు చూసేందుకు సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. బాలీవుడ్ లో తక్కువ బజ్ ఈ చిత్రం రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం.
బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం మొదటి రోజు ఈ చిత్రం మూడు కోట్లు కలెక్ట్ చేయడం కూడా కష్టమే అంట. సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం కూడా ఆడియన్స్ లో మూవీ పైన పెద్ద చర్చ లేదు. కాన్సెప్ట్ మంచిదే అయిన దానిని ఆడియన్స్ కి రీచ్ చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.
ఈ ప్రభావం మూవీ ఓపెనింగ్స్ మీద గట్టిగానే చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే మాత్ టాక్ తో లాంగ్ రన్ కొనసాగడమే కాకుండా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ కూడా అదే విధంగా మాత్ టాక్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తుందేమో చూడాలి.