2023 బాక్సాఫీస్.. 500 కోట్లు రాబట్టిన సినిమాలివే..
2023 ఇయర్ ఎండింగ్ కి వచ్చేసాం. ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. అందుకు కారణం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడమే.
2023 ఇయర్ ఎండింగ్ కి వచ్చేసాం. ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. అందుకు కారణం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడమే. మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే ఈ ఇయర్ టాలీవుడ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం బాలీవుడ్ కి మాత్రం బాగా కలిసొచ్చింది. 2023లో బాలీవుడ్ నుంచి వచ్చిన పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.
వీటిలో పఠాన్, జవాన్ అయితే రూ.1000 కోట్లు కొల్లగొట్టాయి. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తక్కువ సమయంలో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ని పరిశీలిస్తే.. మొదటి స్థానంలో షారుక్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ 'జవాన్' నిలిచింది. ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఆ తర్వాత షారుక్ ఖాన్ మరో మూవీ 'పఠాన్' 5 రోజుల్లో ఈ రికార్డును అందుకుంది. ఇక తాజాగా విడుదలైన రణబీర్ కపూర్ 'యానిమల్' 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ అందుకుంది. ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ మూవీ 'లియో' నిలిచింది. లోకేష్ కనగరాజ్ - తలపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 9రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. లియో తర్వాత మరో బాలీవుడ్ మూవీ 'గదర్ 2' కి రూ.500 కోట్ల క్లబ్ చేరేందుకు ఏకంగా 10 రోజులు పట్టింది.
ఇక చివరి స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' 15 రోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని రజనీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ రూ.500 కోట్ల క్లబ్లో మన టాలీవుడ్ తరఫునుంచి ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం లేకపోవడం గమనార్హం. 2022లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'RRR' వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.
కానీ ఈ సంవత్సరం మాత్రం తెలుగు నుంచి ఏ ఒక్క సినిమా రూ.500 కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయాయి. ఈ సంవత్సరం స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కాకపోవడం ఎందుకు ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే 2023 ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 22న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'సలార్' రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా అయినా టాలీవుడ్ తరుపున రూ.500 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటుందేమో చూడాలి.