రవితేజ టైగర్ కోసం ఇంత ఖర్చు పెట్టారా?
మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో అందరికంటే స్పీడ్ గా సినిమాలు చేస్తోన్న హీరోగా ఉన్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు
మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో అందరికంటే స్పీడ్ గా సినిమాలు చేస్తోన్న హీరోగా ఉన్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అందులో మెగాస్టార్ తో కలిసి చేసిన వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అయ్యింది. రావణాసుర మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో దసరా బరిలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.
రియల్ లైఫ్ రాబిన్ హుడ్ గా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ సినిమాపైన హై ఇంటెన్సన్ క్రియేట్ చేస్తోంది. కచ్చితంగా మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ రావడం ఖాయం అనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజకి జోడీగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అలాగే అనుపమ ఖేర్ లాంటి స్టార్ యాక్టర్ కూడా ఉన్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషలలో ఇప్పటికే మూవీ బిజినెస్ క్లోజ్ అయిపొయింది. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం నిర్మాత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారంట. మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ టైగర్ నాగేశ్వరరావు మీద ఖర్చు పెట్టారు.
ఇప్పటి వరకు రావణాసుర రవితేజ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వచ్చిన చిత్రంగా ఉంటే 65 కోట్ల బడ్జెట్ తో టైగర్ నాగేశ్వరరావు టాప్ లోకి వచ్చింది. రవితేజపై ఈ స్థాయిలో బడ్జెట్ తో ఓ విధంగా రిస్క్ అని చెప్పాలి. కాని కథ డిమాండ్ చేయడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ కావడంతోనే నిర్మాత ఆలోచించకుండా ఈ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావుపై చాలా నమ్మకంతో ఉన్నారు. కచ్చితంగా ఆయన కెరియర్ లో మంచి హిట్ బొమ్మగా ఈ చిత్రం నిలుస్తుందని అనుకుంటున్నారు. దర్శకుడు వంశీకృష్ణ కూడా ఐదేళ్ళు గ్యాప్ తీసుకొని ఎంతో ఇష్టంతో టైగర్ నాగేశ్వరరావు మూవీ చేస్తూ ఉండటం విశేషం.