రెండేళ్ల నుంచి కొట్టుకుంటున్నాం.. ప్రొడ్యూసర్ తో రొమాంటిక్ టాక్..!
నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ రెండేళ్లుగా మేమంతా కొట్టుకుంటూనే ఉంటున్నామని అన్నారు. సిద్ధు ఫ్రీగా ఉంటే అనుపమ బిజీగా ఉండేది.. అనుపమ ఫ్రీగా ఉంటే సిద్ధు ఏదో క్రియేటివ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు.
సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్ లేటెస్ట్ గా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో హీరో హీరోయిన్ సిద్ధు, అనుపమ తో పాటుగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ రెండేళ్లుగా మేమంతా కొట్టుకుంటూనే ఉంటున్నామని అన్నారు. సిద్ధు ఫ్రీగా ఉంటే అనుపమ బిజీగా ఉండేది.. అనుపమ ఫ్రీగా ఉంటే సిద్ధు ఏదో క్రియేటివ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఇలా ఇద్దరిని కలిపి సినిమా తీసేందుకు చాలా కష్టపడ్డామని అన్నారు. ఇదే విషయం గురించి చెబుతూ వంశీ గారు ఫోన్ చేస్తే అంతా రొమాంటిక్ టాకే అంటూ అనుపమ సరదాగా చెప్పుకొచ్చారు.
డీజే టిల్లు అంచనాలను ఏమాత్రం తగ్గకుండా టిల్లు స్క్వేర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు ఎంటర్టైన్ చేస్తాయని. ఇంటర్వెల్ తో పాటుగా ఓ సర్ ప్రైజ్ ఇంకా క్లైమాక్స్ కూడా అదిరిపోతుందని చెప్పుకొచ్చారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా మొదలు పెట్టే టైం లోనే అనుపమని పిలిచి సినిమాలో కథ కాకరకాయ ఏమి ఉండదని చెప్పామని అన్నారు సిద్ధు. డీజే టిల్లుని కూడా బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సినిమా చేశామని అన్నారు నిర్మాత నాగ వంశీ.
లవ్ ఫెయిల్యూర్ అయ్యాక రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి దేవదాసుగా మారడం.. మరోటి దాన్ని దాటి ఒక సక్సెస్ ఫుల్ లైఫ్ పొందడం. డీజే టిల్లు కోర్ కాన్సెప్ట్ ఇదే. ఆ సినిమాలో రాధికతో ప్రేమలో పడి మోసపోయిన టిల్లు ఈసారి లిల్లి తో ప్రేమలో పడతాదు. పరీక్షలు ముగించుకుని హాలీడేస్ లో ఎంచక్కా హాయిగా నవ్వుకునే సినిమాగా టిల్లు స్క్వేర్ వస్తుందని అన్నారు. అంతేకాదు టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు క్యూబ్, ఫోర్ కూడా ఉంటాయని హింట్ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ రొమాన్స్ కూడా టిల్లు స్క్వేర్ కి మేజర్ హైలెట్ గా నిలిస్తుందని చెప్పొచ్చు. యూత్ ఆడియన్స్ అంతా కూడా టిల్లు స్క్వేర్ రిలీజ్ కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమాకు ఒక రేంజ్ బజ్ ఏర్పడగా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.