రాజ్ తరుణ్ బాక్సాఫీస్ ఇది పరిస్థితి
ఒకానొక దశలో ఆయన నుంచి సినిమాలు రావడం కూడా కష్టం అయిపొయింది.
టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి అడుపెట్టాడు. మొదటి సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. తరువాత సినిమా చూపిస్త మామా, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని రాజ్ తరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేదు. దీంతో రాజ్ తరుణ్ మార్కెట్ కూడా డౌన్ అవుతూ వచ్చింది. ఒకానొక దశలో ఆయన నుంచి సినిమాలు రావడం కూడా కష్టం అయిపొయింది.
అయితే ఈ ఏడాది కింగ్ నాగార్జున నా సామి రంగా సినిమాలో రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తాజాగా వారం రోజుల గ్యాప్ లో రాజ్ తరుణ్ నుంచి రెండు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. జులై నెల ఆఖరున పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయ్యింది. ఆగష్టు 2న తిరగబడర సామి మూవీతో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. పురుషోత్తముడు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.
అయితే కమర్షియల్ మాత్రం కలెక్షన్స్ రాలేదు. 2 కోట్ల టార్గెట్ ను కూడా ఆ సినిమా అందుకోలేకపోయింది. దీంతో ఓవరాల్ గా డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఆగష్టు 2న రిలీజ్ అయిన తిరగబడర సామి సినిమాకి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కూడా చేశాడు. అయితే ప్రేక్షకులని ఈ సినిమా ఏ మాత్రం మెప్పించలేదు. గత నెల రోజుల నుంచి రాజ్ తరుణ్ ఇష్యూ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ పై అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసు పెట్టింది. 11 ఏళ్ళు తనతో సహజీవనం చేసి, గర్భవతిని చేసి ఇప్పుడు వదిలేశాడని ఆరోపిస్తూ పోలీసులకి కంప్లైంట్ చేసింది.
వీరిద్దరి గొడవ ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ న్యూస్ గా మారిపోయింది. నిజానికి పురుషోత్తముడు, తిరగబడర సామి సినిమాలపై ఈ వివాదానికి ముందు పెద్దగా బజ్ ఏమి లేదు. ఎప్పుడైతే లావణ్య కాంట్రవర్సీ ఫోకస్ లోకి వచ్చిందో అప్పటి నుంచి సినిమాపైన జనాల్లో ఫోకస్ పెరిగింది. అసలే అంతంత మార్కెట్ తో సతమతం అవుతోన్న రాజ్ తరుణ్ తరుణ్ ఈ లావణ్య వివాదం కారణంగా ఇబ్బంది పడ్డాడు. అయినా కూడా సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు.
తిరగబడర సామి మూవీ మొదటి, రెండు రోజులు ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వేల టికెట్లు కూడా అమ్ముడుకాలేదంట. చాలా చోట్ల నెగిటివ్ షేర్స్ ని అందుకుంది. ఓవరాల్ గా 45 నుంచి 50 లక్షల మధ్యలో రెండు రోజుల్లో గ్రాస్ కలెక్ట్ అయ్యిందంట. ఇందులో 25 లక్షలు షేర్ వచ్చిందంట. నెగిటివ్ షేర్స్ కూడా తీసేస్తే కలెక్షన్స్ ఇంకా తక్కువ ఉంటాయనే మాట వినిపిస్తోంది.