టైగర్ నాగేశ్వరరావు.. మరో బాక్సాఫీస్ రికార్డ్

ఇక మార్కెట్లో సినిమాకు మంచి డీల్స్ కూడా వచ్చాయి. దాదాపు నాన్ థియేట్రికల్ గానే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా డబ్బులు నిర్మాత వెనక్కి తెచ్చుకున్నారు.

Update: 2023-10-27 09:19 GMT

మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు అందుకునే దిశగా కలెక్షన్స్ రాబడుతోంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్స్ పై పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.


రవితేజ కెరీర్ లోనే అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కు మొదట పోస్టర్స్ టీజర్ ద్వారా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక మార్కెట్లో సినిమాకు మంచి డీల్స్ కూడా వచ్చాయి. దాదాపు నాన్ థియేట్రికల్ గానే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా డబ్బులు నిర్మాత వెనక్కి తెచ్చుకున్నారు.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి కూడా మంచి కలెక్షన్ అయితే సాధిస్తుంది. మొదట సినిమాని నిడివి పై వివిధ రకాల కామెంట్స్ వచ్చాయి. దీంతో ఆ తర్వాత చిత్ర యూనిట్ ఆలోచించి రన్ టైం తగ్గించడం ద్వారా ఆడియెన్స్ మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఏకంగా 50 కోట్ల మైలురాయిని అందుకోవడం విశేషం.

రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా టైగర్ నాగేశ్వర్ రావు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో రవితేజ నటనకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కేవలం కమర్షియల్ ఫార్మాట్లోనే కాకుండా రవితేజ ప్రయోగాత్మక మైన సినిమాలు తో కూడా మెప్పించగలరు అని మరోసారి నిరూపించాడు. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ హీరోయిన్ గా నటించగా ఒక కీలకమైన పాత్రలో రేణు దేశాయ్ కనిపించారు.

రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో సినిమాకు బజ్ అయితే పెరిగితే ఇక. రవితేజ విభిన్నమైన షేడ్స్ లో టైగర్ నాగేశ్వరరావుగా సరికొత్త గా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా హైలైట్ అయింది.

ఇక రెండో వారంలో కూడా టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ తో కొనసాగుతున్నాడు. ఈ శుక్రవారం కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. శనివారం కూడా లెక్క పెరిగితే సినిమాకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ దోపిడీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

Tags:    

Similar News