శ‌ర్వానంద్ హీరోయిన్ స్ట‌న్నింగ్ శారీ లుక్

సుర్వీన్ చావ్లా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ బాలీవుడ్‌లో ఈ భామ న‌టిగా కెరీర్ ప‌థాన్ని కొన‌సాగించింది.

Update: 2024-11-11 01:30 GMT

సుర్వీన్ చావ్లా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ బాలీవుడ్‌లో ఈ భామ న‌టిగా కెరీర్ ప‌థాన్ని కొన‌సాగించింది. కానీ ఆశించిన స్థాయికి ఎద‌గ‌డంలో స్టార్ డ‌మ్ ని అందుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. మంచు మోహ‌న్ బాబు- శ‌ర్వానంద్ క‌థానాయ‌కులుగా న‌టించిన `రాజు మ‌హారాజు` చిత్రంలో శ‌ర్వానంద్ కి జోడీగా న‌టించిన‌ సుర్వీన్ అంత‌కుముందు రాజ‌శేఖ‌ర్ తోను ఓ సినిమాలో న‌టించింది.


2023 లో వివాదాస్ప‌ద `రానా నాయుడు` వెబ్ సిరీస్ లోను ఈ భామ న‌టించింది. ద‌గ్గుబాటి వెంక‌టేష్, రానా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ వెబ్ సిరీస్ పై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ సిరీస్ సుర్వీన్ కి చివ‌రి సౌత్ ఆఫ‌ర్. ఇప్పుడు రానా నాయుడు రెండో సీజ‌న్ తెర‌కెక్కుతోంది. ఇందులో అర్జున్ రాంపాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చినా, సుర్వీన్ చేరిందా లేదా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు.


మ‌రోవైపు సుర్వీన్ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో యువ‌త‌రం హృద‌యాల‌ను గెలుచుకుంటోంది. తాజాగా ఈ భామ సాంప్ర‌దాయ చీర లో ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపించింది. చాక్లెట్ బ్రౌన్ క‌ల‌ర్... గోల్డ్ క‌ల‌ర్ కాంబినేష‌న్ లో స్పెష‌ల్ డిజైన‌ర్ శారీ కాంబినేష‌న్ బ్లౌజ్ సుర్వీన్ అందాన్ని ప‌దింత‌లు పెంచాయి. సుర్వీన్ డ్యాషింగ్ లుక్స్ మైమ‌రిపించాయి. ఫోటోషూట్ కోసం ఎంపిక చేసుకున్న చాక్లెట్ బ్రౌన్ బ్యాక్ గ్రౌండ్ అద‌న‌పు హంగును చేర్చింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం సుర్వీన్ ఫోటోషూట్ వెబ్ లో వేగంగా దూసుకుపోతోంది.


సుర్వీన్ చావ్లా గ‌తాన్ని ప‌రిశీలిస్తే... చిన్న స్క్రీన్ నుండి పెద్ద తెర‌కు ప‌రిచ‌య‌మైన బ్యూటీగా సుప‌రిచితురాలు. కహీ తో హోగా, కజ్జల్ వంటి షోలతో సుర్వీన్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అగ్లీ, హేట్ స్టోరీ 2, క్రియేచర్ 3డి తదితర చిత్రాలతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుర్వీన్ అందం ఆక‌ర్ష‌ణ ఎప్పుడూ యువ‌త‌రంలో హాట్ టాపిక్. తన బోల్డ్ సె* అవతార్ ల‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్ర‌యాణంలో స‌హ‌చ‌ర స్టార్ల‌తో లింక్-అప్‌లు, సంబంధాలు వ‌గైరా ప్ర‌చారం ఉంది. అప్పటికే వివాహితుడైన అపూర్వ అగ్నిహోత్రితో సుర్వీన్ సంబంధం తీవ్రంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ సుర్వీన్ తో కొన్ని నెల‌ల అనుబంధం త‌ర్వాత అపూర్వ తిరిగి త‌న వైఫ్ కే ప్రాధాన్య‌త‌నిచ్చాడు.

Tags:    

Similar News