టాలీవుడ్ - కోలీవుడ్ మాస్ కలయిక

టాలీవుడ్ కోలీవుడ్ కలయిక మరో స్థాయికి చేరుకుంటోంది. గత కొంత కాలంగా తెలుగు హీరోలు తమ మార్కెట్‌ను విస్తరించేందుకు తమిళ దర్శకులతో చేతులు కలుపుతున్నారు.

Update: 2025-02-10 07:16 GMT

టాలీవుడ్ కోలీవుడ్ కలయిక మరో స్థాయికి చేరుకుంటోంది. గత కొంత కాలంగా తెలుగు హీరోలు తమ మార్కెట్‌ను విస్తరించేందుకు తమిళ దర్శకులతో చేతులు కలుపుతున్నారు. ఇటీవల ‘జవాన్’ తో ఇచ్చిన అట్లీ, నెల్సన్ ‘జైలర్’తో సౌత్ మార్క్‌ను మళ్లీ నిలబెట్టారు. లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు మాస్ డైరెక్టర్లు తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేయబోతున్నట్టు సమాచారం.

క్రేజీ కాంబోల్లో అట్లీ అల్లు అర్జున్ మూవీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ ఓ వైపు బాలీవుడ్‌లో ‘జవాన్’ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తరువాత అక్కడి మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు సల్మాన్ ఖాన్‌తో సినిమా ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది. దీంతో అట్లీ మళ్లీ దక్షిణాది మార్కెట్‌పై దృష్టిపెట్టాడు. అందులో భాగంగా అల్లు అర్జున్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో వచ్చే ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. ఇప్పటికే అట్లీ సన్ పిక్చర్స్ కాంబోలో సూపర్ హిట్ ‘బిగిల్’ వచ్చింది. దీంతో ఈసారి బన్నీతో తీయబోయే సినిమా అంతకంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

అసలైతే నెక్స్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమాను స్టార్ట్ చేయాలి. కానీ ఆ ప్రాజెక్టుని బన్నీ హోల్డ్ లో పెట్టె అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎన్టీఆర్ కూడా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడు. నెల్సన్ రజినీకాంత్ తో ‘జైలర్’తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మాస్ అంశాలతో పాటు కామెడీకి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే డైరెక్టర్ కావడంతో ఎన్టీఆర్‌తో చేసే సినిమా వినోదాత్మకంగా ఉండబోతుందని సమాచారం.

ఇక ప్రభాస్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే, ఇది ఫ్యాన్స్‌కి డ్రీమ్ ప్రాజెక్ట్. లోకేశ్ స్టైల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్స్‌కి ఎంతో ఆదరణ ఉంది. ‘విక్రమ్’, ‘లియో’ లాంటి సినిమాలతో మార్కెట్‌ను విస్తరించుకున్న లోకేశ్, ప్రభాస్‌తో ఓ డార్క్ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఇది ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు. మొత్తానికి, తమిళ దర్శకులతో తెలుగు హీరోల హ్యాట్రిక్ ప్రాజెక్టులు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వీటిలో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News