ఫోటో స్టోరి: భంగి*మలతో మతులు చెడగొడుతోంది
ఇప్పటికీ నెటిజనుల్లో రకరకాల కారణాలతో నిరంతరం చర్చల్లోకొస్తోంది.
ముంబై బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ కెరీర్ జర్నీ, లేటెస్ట్ ప్రయత్నాల గురించి తెలిసిందే. మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి ఈ ప్రయాణం అలా సాగుతూనే ఉంది. అందం ప్రతిభ ఉన్నా లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఇటీవల బాలకృష్ణ, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరోలు అవకాశాలు కల్పించినా తనకు మాత్రం గుర్తింపు లేకుండా పోయింది. అయినా ఈ బ్యూటీ ఎంతమాత్రం నిరాశ చెందక నటిగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.
ఇప్పటికీ నెటిజనుల్లో రకరకాల కారణాలతో నిరంతరం చర్చల్లోకొస్తోంది. ముఖ్యంగా ప్రగ్య సోషల్ మీడియా పోస్టులు వేగంగా వైరల్ అవుతున్నాయి. బోల్డ్ బ్యూటీ అన్ లిమిటెడ్ బోల్డ్ ఫోటో ట్రీట్ కి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ ముంబై బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వేగంగా దూసుకెళుతోంది. బ్రౌన్ కలర్ థై హై స్లిట్ ఫ్రాకులో ప్రగ్య టూమచ్ హా*గా కనిపిస్తోంది. హాఫ్ షోల్డర్ డిజైన్ గ్లామ్ కంటెంట్ ని పీక్స్ కి చేర్చింది. ప్రగ్య రకరకాల భంగిమలతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అయిపోతున్నాయి. లైక్ లు క్లిక్ లు హోరెత్తుతున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ ఆగస్ట్ 15న విడుదల కానున్న `ఖేల్ ఖేల్ మే` చిత్రంతో మరోసారి లక్ చెక్ చేసుకుంటోంది. ఈ సినిమా విజయం తనకు చాలా కీలకం. ఈ సినిమాకి కథను అందించిన ముదస్సర్ అజీజ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, అమ్మీ విర్క్, వాణి కపూర్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్ తదితరులు ఇందులో నటించారు. ఇది వైట్ వరల్డ్ ప్రొడక్షన్స్, వాకావో ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో తెరకెక్కింది. తనిష్క్ బాగ్చి, రోచక్ కోహ్లి సహా పలువురు సంగీత దర్శకులు సౌండ్‌ట్రాక్ కోసం పని చేసారు. ప్రగ్య మరోవైపు ఎన్బీకే 109 - టైసన్ నాయుడు అనే రెండు తెలుగు చిత్రాలలో పని చేస్తోంది.