ఈ నాలుగు చిత్రాలకు అన్నీ వైపుల గండాలే!
ఈ ఏడాది డిసెంబర్ 22న సలార్ రిలీజ్‌కు రెడీ అవ్వడంతో ఇతర సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి
ఈ ఏడాది డిసెంబర్ 22న సలార్ రిలీజ్‌కు రెడీ అవ్వడంతో ఇతర సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. క్రిస్మస్ రేస్ నుంచి వెంకటేశ్ సైంధవ్, నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డీనరీ సినిమాలు తప్పుకున్నాయి. అయితే వీటిలో సైంధవ్ ఒకటే సంక్రాంతికి వెళ్లింది. మిగతా చిత్రాలు డిసెంబర్ తొలి వారానికి ప్రీ పోన్ అయ్యాయి.
హాయ్ నాన్న డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలైంటైన్ ఇప్పటికే ఇదే విడుదల తేదీని(డిసెంబర్ 8) కన్ఫామ్ చేసుకుంది. అలాగే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది), నితిన్ ఎక్స్ట్రా ఆర్డీనరి కూడా డిసెంబర్ 8నే రానున్నాయి.
అయితే ఈ నాలుగు సినిమలు డిసెంబర్ 7, 8 తేదీల్లో రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ సినిమాలకు వారం రోజుల ముందు అంటే డిసెంబర్ 1వ తేదీన భారీ వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా యానిమల్ థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే ఈ నాలుగు చిత్రాలకు ఓ పది రోజుల తర్వాత డంకీ, కెప్టెన్ మిల్లర్, సలార్ లాంటి భారీ బడ్జెట్ బడా సినిమాలు విడుదల కానున్నాయి.
మరి ఇలాంటి టఫ్ అండ్ టైట్ షెడ్యూల్ మధ్య ఈ నాలుగు చిత్రాలను ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం రిస్కీ అనే చెప్పాలి. ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్లను అందుకోవడానికి.. మేజర్ హాలీవుడ్ కూడా లేవు. మరి ఇలాంటి సమయంలో ఒకదానితో మరొకటి క్లాష్ అవ్వడం అంటే.. కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపుతుంది.
పైగా డిసెంబర్ 3న ఎలెక్షన్స్ కూడా పూర్తవుతాయి. దీనికి సంబంధించిన ప్రభావం కూడా మరో వారం రోజుల వరకు అయినా ఉంటుంది. అంతా ఈ హాడావుడిలోనే ఉంటారు. ఇది కూడా ఈ నాలుగు సినిమాల రిలీజ్‌కు కాస్త మైనస్ అవుతుందనె చెప్పాలి. అన్నీ వైపుల నుంచి ఏదో ఒకటి.. ఈ సినిమాల రిలీజ్ డేట్‌కు కాస్త అడ్డుగానే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాలు డిసెంబర్ 7,8 తేదీల్లో రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదని, కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో...