కుర్రాళ్లతో సీనియర్లు కుమ్మేస్తున్నారు!
చిరంజీవి...బాలకృష్ణ..వెంకటేష్..నాగార్జున ట్రెండ్ మార్చారు. జూనియర్ హీరోలతోనూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు
చిరంజీవి...బాలకృష్ణ..వెంకటేష్..నాగార్జున ట్రెండ్ మార్చారు. జూనియర్ హీరోలతోనూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. అంతేనా! తాము సీనియర్లుం..సీనియర్ మేకర్లే కావాలని కూర్చొలేదు. ట్రెండ్ ఫాలో అవుతూ..ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్నారు. ఆ విషయంలో నటసింహ బాలయ్య మరింత మెరుగ్గా కనిపిస్తున్నారు. కొత్త వాళ్లు ఎవరు సక్సెస్ అవుతున్నారో చూసుకుని వాళ్లతో సినిమాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్లాప్ ల్లేని అనీల్ రావిపూడితో 'భగవంత్ కేసరి' చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో బాలయ్య థియేటర్లో అరుపులెట్టించడం ఖాయమంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం కొత్త వాళ్లతో సినిమాలు చేయాలని మాటల వరకూ పరిమితం చేసినా ..ఇప్పుడు ప్రాక్టికల్ గా నిరూపిస్తున్నారు. 'బింబిసార' దర్శకుడు వశిష్టతో తన 157వ సినిమాని పట్టాలెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదో సోషియా ఫాంటసీ చిత్రంగా తెలుస్తోంది. వశిష్ట చేసింది కేవలం ఒక్క సినిమానే. ఆ సినిమా తో మేకర్ గా మంచి గుర్తింపు రావడంతో చిరు మరో ఆలోచన లేకుండా ముందుకెళ్లిపోతున్నారు. డైరెక్టర్ మారుతికి కూడా చిరు గతంలో ప్రామిస్ చేసారు. ప్రభాస్ తో మారుతి చేస్తోన్న సినిమా సక్సెస్ అయితే గనుక కాంబినేషన్ లో సినిమా పక్కా అనడంలో సందేహం లేదు. ఇక విక్టరీ వెంకటేష్ చాలా కాలం సీనియర్లు అంటూ కూర్చున్నా ఇప్పుడాయన పద్దతి మార్చారు.
కొత్త వాళ్లతోనే కొత్త తరహా కథలొస్తాయని విశ్వషిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'హిట్' దర్శకుడు శైలేష్ కొలనుతో 'సైంధవ్' ని పాన్ ఇండియాలో పట్టాలెక్కించారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయం తో వెంకీ ఇమేజ్ మారుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా తర్వాత 'డీజేటిల్లు' దర్శకుడు విమల్ కృష్ణతోనూ వెంకీ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఇక కొత్త వాళ్లని ప్రోత్సహించడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుటారు. కానీ సక్సస్ అనేది మిస్ పైర్ అవుతుంది. అయినా నమ్మకం కోల్పోలేదు. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని 'నా సామిరంగ'తో దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. ఇందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొస్తున్నాయి. నాగ్ న్యూ లుక్ మాస్ లోకి దూసుకుపోయింది.