టాలీవుడ్ క్రేజీ సినిమాలు.. ఓటీటీ రైట్స్ ఎవరికంటే..

అలాగే స్టార్ హీరోల సినిమాలకి ఎక్కువగా నాన్ థీయాట్రికల్ బిజినెస్ ఉంటుంది.

Update: 2024-03-20 04:57 GMT

ప్రస్తుతం సినిమాలకి థియేటర్స్ బిజినెస్ పాటు డిజిటల్ మార్కెట్ కూడా ఉంది. కంటెంట్ బాగుందనే టాక్ వస్తే ఓటీటీ ఛానల్స్ ఆ సినిమాలని ఫ్యాన్సీ రేటుని రైట్స్ కోసం ఆఫర్ చేసి మరీ ముందుకొస్తున్నాయి. ఓటీటీ ఛానల్స్ మార్కెట్ విస్తరించుకోవడానికి, యూజర్స్ ని పెంచుకోవడానికి కోట్ల రూపాయిలు వెచ్చిస్తూ ట్రెండింగ్ లో ఉండే చిత్రాలని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అలాగే స్టార్ హీరోల సినిమాలకి ఎక్కువగా నాన్ థీయాట్రికల్ బిజినెస్ ఉంటుంది. డిజిటల్ ఛానల్స్ స్టార్ హీరోల చిత్రాలని రిలీజ్ కి ముందుగానే కొనడానికి పోటీ పడుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల చిత్రాలకి సంబందించిన ఓటీటీ పార్ట్నర్స్ ఇప్పటికే లాక్ అయిపోయారు. అంటే డిజిటల్ రైట్స్ డీల్స్ షూటింగ్ స్టేజ్ లోనే ఆయా సినిమాలకి క్లోజ్ అయిపోయాయని అర్ధమవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో సిద్ధం అవుతోన్న దేవర మూవీ హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీని ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రైమ్ వీడియో భారీ ధరకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి రిలీజ్ కి సిద్ధం అయినా టిల్లు స్క్వేర్ మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ డిజిటల్ హక్కులని ప్రైమ్ వీడియో భారీ ధరకి కొనుగోలు చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం మొదట నెట్ ఫ్లిక్స్ గట్టిగానే పోటీ పడింది. కానీ చివరకు అమెజాన్ మంచి డీల్ ఆఫర్ చేయడంతో దిల్ రాజు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ హక్కుల కోసం కూడా ఓటీటీ సంస్థలు అన్ని కూడా పోటీ పడగా చివరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి తెలుగు సినిమాల కోసం నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఛానల్స్ ఏ రేంజ్ లో పోటీ పడుతున్నాయో చెప్పవచ్చు.

Tags:    

Similar News