షూట్ లో రణ్ బీర్ - త్రిప్తి.. అలా..

అయితే ఈ సినిమాలో జోయా పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి అందరి దృష్టిని ఆకర్షించింది.

Update: 2023-12-11 01:30 GMT

యానిమల్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటి త్రిప్తి డిమ్రి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రిష్ రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో జోయా పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా రణ్ బీర్ తో ఆమె నటించిన సీన్స్ అందిరినీ షాక్ కుగురిచేశాయి. ఇంటిమేట్ సీన్స్ లో త్రిప్తి రెచ్చిపోయి మరీ నటించింది. రణ్ బీర్ తో ఓ సీన్ లో త్రిప్తి డ్రెస్సింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై స్పందించింది.

ఆ సీన్స్ సినిమాకు అవసరం కాబట్టే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది త్రిప్తి. దాన్ని షూట్‌ చేసే సమయంలోనూ దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. అతి తక్కువ మంది సమక్షంలో దాన్ని చిత్రీకరించినట్లు తెలిపింది. "ఆరోజు నేను, రణ్ బీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ మాత్రమే సెట్ లో ఉన్నాం. రణ్ బీర్ ప్రతి ఐదు నిమిషాలకోసారి బాగానే ఉన్నావా అని అడిగారు. ఏమైనా కావాలా అని అడిగారు. దీంతో నేను ఏమాత్రం అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు" అని చెప్పింది.

సినిమాలోని రణ్ బీర్ తో ఓ సన్నివేశంలో అతని షూస్ నాకే సీన్ పై వచ్చిన విమర్శలపై త్రిప్తి మాట్లాడింది. "అది నా యాక్టింగ్ కోచ్ నాకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. మన పాత్రను జడ్జ్ చేయకూడదు అన్నది గోల్డెన్ రూల్. మనం పోషించే పాత్రలు మన కోస్టార్స్ పోషించే పాత్రలు కూడా మనుషులే. మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. అన్ని పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే అదే మనసులో పెట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది తృప్తి.

యానిమల్ సినిమా తర్వాత త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ చూసి నెటిజన్లంతా ఆశ్యర్చపోతున్నారు. నవంబర్‌ చివరి వారంలో ఆమెకు ఆరు లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. 2015లో త్రిప్తి ఇన్‌స్టా ఫ్యామిలీలోకి అడుగుపెట్టగా.. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు రీల్స్‌తోనూ ఆమె సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లు అన్నింటికి లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.

Tags:    

Similar News