స్కిన్ షోతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది.. ఇదెట్టా?

తాజాగా త్రిప్తీ కొత్త ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. అచ్చం క్రిస్మ‌స్ ట్రీని త‌ల‌పించేలా అంద‌మైన ప‌చ్చ రంగు మిరుమిట్ల దుస్తుల్లో ఈ భామ క‌నిపించింది.

Update: 2023-12-16 16:42 GMT

యానిమల్ స్టార్ ట్రిప్తీ డిమ్రీ పేరు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో మార్మోగుతోంది. ఇటీవ‌ల ఈ బ్యూటీ..ప్రముఖ ఫోటోగ్రాఫర్ కం వ్యాపారవేత్త రాహుల్ ఝాంగియాని వివాహ వేడుకల కోసం గోవాకు వెళ్లింది ట్రిప్తీ. స్పాట్ నుంచి అంద‌మైన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ విజయాన్ని ఆస్వాధిస్తున్న ట్రిప్తీ డిమ్రీ తనకంటూ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఘాటైన న‌ట‌న‌తో ట్రిప్తీ షో స్టాప‌ర్ గా నిలిచింది. ఇంటర్నెట్‌లో నేషనల్ క్రష్ -భాభి 2గా పిలుపందుకుంటున్న ట్రిప్తీ యానిమ‌ల్ విడుదలైనప్పటి నుండి చాలా మంది ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆకర్షించింది. ఈ విజ‌యాన్ని ఆస్వాధిస్తూనే స్నేహితురాలి వివాహానికి హాజరై పండుగ సీజన్‌కు గ్లామర్ ను జోడించింది.


తాజాగా త్రిప్తీ కొత్త ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. అచ్చం క్రిస్మ‌స్ ట్రీని త‌ల‌పించేలా అంద‌మైన ప‌చ్చ రంగు మిరుమిట్ల దుస్తుల్లో ఈ భామ క‌నిపించింది. క్రిస్మ‌స్ ట్రీ ఫోటోని కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోషూట్ ప్ర‌స్తుతం యువత‌రంలో వైర‌ల్ గా మారుతోంది. ఇంత‌లోనే ఒక అభిమాని తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసాడు. ''బుల్‌బుల్ & ఖలాలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించినప్పుడు ఎవరూ గమనించలేదు.. తన శ‌రీరాన్ని చూపించినప్పుడు సెన్సేషనల్ నేషనల్ క్రష్‌గా మారింది...'' అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసాడు.


కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే.. ట్రిప్టి డిమ్రీ త‌దుప‌రి రెండు భారీ సినిమాలు చేస్తోంది. తదుపరి విక్కీ కౌశల్ సరసన మేరే మెహబూబ్ మేరే సనమ్ లో ప్ర‌భాస్ స‌ర‌సన స్పిరిట్ లో న‌టించ‌నుంది. రాజ్‌కుమార్ రావు తో 'విక్కీ విద్యా కా వో వాలా' వీడియోలోను న‌టిస్తోంది. యానిమ‌ల్ లో గ్లామ‌ర్ షోతో ఆక‌ట్టుకోక ముందే ప‌లు చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో మెప్పించింది ఈ బ్యూటీ. కానీ అప్ప‌ట్లో ఎవ‌రూ అంత‌గా గుర్తించ‌లేదు. ఇప్పుడు స్కిన్ షోతో నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారింది.


Tags:    

Similar News