హీరోయిన్ లిప్స్ సర్జరీ.. నిజం ఎంత?
ఇప్పుడు ఈ సర్జరీల విషయం ఏందుకు వచ్చిందంటే స్టార్ హీరోయిన్ త్రిష లిప్స్ సర్జరీకి సిద్ధం అయ్యిందనే వార్త తమిళ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది.
బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్‌లో ఎంతో మంది అందం కోసం చిన్న చిన్న సర్జరీ చేయించుకున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాకుండా హీరోల్లోనూ కొందరు సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. కొందరు పెద్ద పెద్ద సర్జరీలు సైతం చేయించుకున్న వారు ఉన్నారు. కొందరు సర్జరీలు వికటించడంతో సినిమాలకు దూరం అయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ సర్జరీల విషయం ఏందుకు వచ్చిందంటే స్టార్ హీరోయిన్ త్రిష లిప్స్ సర్జరీకి సిద్ధం అయ్యిందనే వార్త తమిళ్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి త్రిష లిప్స్ విషయంలో కొందరు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. చాలా సార్లు ఆమె లిప్స్ గురించి దారుణమైన బూతులు తిట్టిన వారు ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దాదాపు 20 ఏళ్ల తర్వాత త్రిష ఇప్పుడు లిప్స్ సర్జరీకి వెళ్లడంపై ఆలోచన చేస్తుందట. ఇప్పటికీ చాలా బిజీగా సినిమాలు చేస్తున్న త్రిష ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్లు అయినా లిప్స్ గురించి విమర్శలు ఆగడం లేదు, అందుకే త్రిష ఈ నిర్ణయాన్ని తీసుకుందని, కేవలం 20 నుంచి 30 రోజుల్లో సర్జరీ జరగడంతో పాటు, నార్మల్‌గా షూటింగ్‌కు హాజరు అయ్యే విధంగా త్రిష చిన్న సర్జరీకి సిద్ధం అవుతోందని తమిళ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఆమె నుంచి కానీ, ఆమె సన్నిహితుల నుంచి కానీ ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ త్రిష ఇప్పుడు ఉన్నట్టు ఉంటేనే బాగుంటుందని, ఆమె అందం పెంచుకోవడం కోసం లిప్స్ షేప్ కోసం సర్జరీకి వెళ్తే అభిమానులకు ఆమె నిరాశ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో త్రిష సర్జరీ చేయించుకోవడం ద్వారా లేని పోని అనారోగ్య సమస్యలు సైతం వస్తాయేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్రిష సర్జరీ గురించి వస్తున్న వార్తలు పుకార్లే కావాలని, నిజం కాకూడదని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
త్రిష ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఈ సమ్మర్‌లోనే చిరంజీవితో కలిసి త్రిష విశ్వంభర సినిమాతో రానుంది. మరో వైపు తమిళ్‌లోనూ సూపర్ స్టార్ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే అక్కడ కూడా ఈ అమ్మడి సినిమా విడుదల కాబోతుంది. దాదాపు మూడు నాలుగు సినిమాలతో ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రిష వచ్చే ఏడాదిలో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. లిప్ సర్జరీ తర్వాత త్రిష ఎలా ఉంటుందా అని కొందరు ఇప్పటి నుంచే సోషల్ మీడియా ద్వారా ఊహా చిత్రాలు పంచుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు త్రిష టీం నుంచి ఈ విషయమై క్లారిటీ రాలేదు.