త్రిష కూడా రెండేళ్ల తర్వాతే అంటుందట..?
ఈ క్రేజ్ తో తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటుంది త్రిష.
రెండు దశాబ్దాలుగా సౌత్ సినీ ఆడియన్స్ ని అలరిస్తూ ఇప్పటికీ అదే ఫాం క్రేజ్ కొనసాగిస్తుంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ నత్త నడక నడిచినా తనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్మి అలానే కొనసాగింది. త్రిష సంకల్ప బలమో ఏమో కానీ మళ్లీ తిరిగి అమ్మడు సూపర్ ఫాం లోకి వచ్చింది. వరుస స్టార్ సినిమాలు ఆమెను బిజీ అయ్యేలా చేశాయి. కోలీవుడ్ లో పి.ఎస్ 1, 2, దళపతి విజయ్ తో లియో ఇలా వరుస అవకాశాలు అమ్మడిని టాప్ లో ఉండేలా చేశాయి.
ఈ క్రేజ్ తో తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటుంది త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమా చేస్తుంది అమ్మడు. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అటు తమిళంలో ఇటు తెలుగులో దాదాపు నాలుగు సినిమాల దాకా చేతిలో ఉన్న త్రిష కొత్త సినిమాకు సైన్ చేయాలంటే అది రెండేళ్ల తర్వాతే అని అంటున్నారు. కోలీవుడ్ లో త్రిష చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ భారీ అంచనాలతో వస్తున్నాయి.
మెగా విశ్వంభర కూడా ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇవ్వనుంది. అందుకే చేస్తున్న సినిమాలకు తన పూర్తి స్థాయి డేట్స్ ఇచ్చిన త్రిష కొత్త సినిమాకు సైన్ చేయాలంటే ఇప్పటివరకు కమిటైన సినిమాలు పూర్తి చేయాలని అంటుందట. అంతేకాదు ఈ వరుస సినిమాల క్రేజ్ వల్ల అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు తెలుస్తుంది. త్రిష సీనియారిటీ సినిమాలకు హెల్ప్ అవుతుందని అమ్మడు అడిగినంత ఇచ్చేస్తున్నారట మేకర్స్.
నీ మనసు నాకు తెలుసు నుంచి రాబోతున్న విశ్వంభర వరకు త్రిష చేసిన సినిమాల్లో తను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఐతే కెరీర్ కొన్నాళ్లు కేవలం సొంత భాష తమిళ పరిశ్రమకే పరిమితం చేసిన త్రిష మళ్లీ ఇన్నాళ్లకు ఇతర భాషల్లో ఆఫర్లు అందుకుంటుంది. అమ్మడు ఫాం చూస్తుంటే బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుకునేలా ఉందని చెప్పొచ్చు. కెరీర్ ఈ రేంజ్ జోష్ కనబరుస్తున్న త్రిష మీద పెళ్లి వార్తలు కూడా ఆగట్లేదు. కానీ కెరీర్ అంత ఆశాజనకంగా లేనప్పుడే పెళ్లికి దూరంగా ఉన్న త్రిష ఇంత బిజీలో మ్యారేజ్ పై అసలు ఆలోచించే ప్రసక్తే లేదని తెలుస్తుంది.