త్రివిక్ర‌మ్ పంచ్: స‌మంత హైద‌రాబాద్ రావ‌డానికి దారేది?

ఆలియా భ‌ట్ న‌టించిన `బ్ర‌హ్మాస్త్ర` తెలుగులోను విడుద‌లైంది. టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ లోను ఆలియా న‌టించింది.

Update: 2024-10-08 15:05 GMT

ఆలియా భ‌ట్ న‌టించిన `బ్ర‌హ్మాస్త్ర` తెలుగులోను విడుద‌లైంది. టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ లోను ఆలియా న‌టించింది. ఈ రెండు సినిమాల‌తో త‌న ప్ర‌తిభ ఎలాంటిదో సౌత్ లో అంద‌రికీ అర్థ‌మైంది. ఇప్పుడు ఆలియా తాను న‌టించిన జిగ్రా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌మోట్ చేస్తోంది. ఆలియా న‌టించి నిర్మించిన‌ జిగ్రా తెలుగు వెర్ష‌న్ ప్ర‌చారం కోసం ఆలియా నేరుగా హైద‌రాబాద్ లో అడుగుపెట్టింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన స‌మంత రూత్ ప్ర‌భు మాట్లాడుతూ.. ద‌గ్గుబాటి రానా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రానా నాకు బ్రదర్ లాంటివాడు‌‌. అతడి లాంటి అన్న‌య్య‌ ప్రతి అమ్మాయికి ఉండాలి అని అన్నారు. అత‌డికి పెళ్ల‌యింది కాబ‌ట్టి అమ్మాయిలు అన్న‌య్య అని పిల‌వొచ్చు ఇక‌! అని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. గ‌త నెల‌లో నాయికా ప్ర‌ధాన చిత్రాన్ని స‌మ‌ర్పించిన రానా ఈ నెల‌లో మ‌రొక‌టి అలాంటి సినిమానే స‌మ‌ర్ప‌కుడిగా రిలీజ్ చేస్తున్నార‌ని స‌మంత అన్నారు. తాను తెలుగు వారి ప్రేమ వల్లే ఎదిగాను. నాకు జిగ్రాస్ అంటే నా అభిమానులే అని కూడా వ్యాఖ్యానించారు.

ర‌జ‌నీ త‌ర్వాత స‌మంతే: త్రివిక్ర‌మ్

జిగ్రా ప్ర‌చార వేదిక‌పై మ‌రో అతిథి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ముంబైలో ఉంటున్న స‌మంత హైద‌రాబాద్ కి వ‌చ్చి తెలుగు సినిమాల్లోను న‌టించాల‌ని త‌న ఆకాంక్ష‌ను వెలిబుచ్చారు. స‌మంత రావాల‌ని అంద‌రూ కోరుకోండి ట్రెండ్ చేయండి అని కూడా అన్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా అన్ని పరిశ్రమల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తార‌లలో రజనీకాంత్‌ తర్వాత సమంతకే ఆ స్థానం ద‌క్కుతుంది.. అని అన్నారు.

సమంత `ఏం మాయ చేసావే` మూవీ నుంచే హీరో. అప్పటి నుంచే సమంతకు బన్నీ కూడా అభిమాని అని తెలిపారు. ``సమంత ముంబైలోనే కాకుండా.. హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు రావాలని కోరుకుంటున్నాను. మీరు హైదరాబాద్‌లో లేరని.. మీరు ఇక్క‌డ సినిమాలు చేయడం లేదని మేం మీకు కథలు రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం రాస్తాం..`` అని అన్నారు. అత్తారింటికి దారేది లాగా సమంత కోసం `హైదరాబాద్‌కు దారేది` అని అనాలేమో అని త్రివిక్ర‌మ్ ఛ‌మ‌త్క‌రించారు. అందరూ సమంత హైదరాబాద్ రావాలని ట్రెండ్ చేయాలి. మళ్లీ తెలుగు సినిమాలలో కంబ్యాక్ ఇవ్వాలని కోరుతున్నాను అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News