ఆ స్థానం కోల్పోయిన త్రివిక్రం..!

అయితే అతని మాటల మ్యాజిక్ పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది. త్రివిక్రం రీసెంట్ రిలీజ్ గుంటూరు కారం సినిమాలో అసలు డైరెక్టర్ గా అతని మార్క్ కనిపించలేదు.

Update: 2024-01-17 08:05 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ రైటర్ క‌మ్ డైరెక్టర్ గా ప్రతి సినిమాలో తన ముద్ర వేస్తూ వచ్చారు. ప్రతి సినిమాలో తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ వచ్చిన త్రివిక్రం తన మాటలతో ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తాడు. కథ కథనాలు అంత గొప్పగా లేకపోయినా సరే మాటలతో మ్యాజిక్ చేస్తాడు త్రివిక్రం. అందుకే అతన్ని మాటల మాంత్రికుడని అందరు అంటుంటారు. అయితే అతని మాటల మ్యాజిక్ పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది. త్రివిక్రం రీసెంట్ రిలీజ్ గుంటూరు కారం సినిమాలో అసలు డైరెక్టర్ గా అతని మార్క్ కనిపించలేదు.

గుంటూరు కారం సినిమా మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన థర్డ్ మూవీ. అతడు, ఖలేజా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే త్రివిక్రం మార్క్ వాటిల్లో కనిపించింది. అయితే గుంటూరు కారం విషయంలో మాత్రం త్రివిక్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమా చూసిన ఆడియన్స్ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా ఉంది తప్ప ఇందులో ఎక్కడ త్రివిక్రం మార్క్ కనిపించలేదే అని చెబుతున్నారు.

త్రివిక్రం సినిమాల్లో ఉండాల్సినంత ఎమోషనల్ కంటెంట్.. తూటాల్లాంటి మాటలు గుంటూరు కారం లో మిస్ అయ్యాయి. ఏదో ఉన్నంతలో మహేష్ తన మాస్ మేనియాతో.. డ్యాన్సులతో మెప్పించి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. కేవలం మహేష్ బాబు పెట్టిన ఫుల్ ఎఫర్ట్ వల్లే సినిమా ఈ రేంజ్ టాక్ తెచ్చుకుందని చెప్పొచ్చు. గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబే బిగ్ సేవియర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన త్రివిక్రం తన మొదటి డైరెక్టోరియల్ మూవీ నువ్వే నువ్వే నుంచి రైటర్, డైరెక్టర్ ఈ రెండిటిలో తను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా త్రివిక్రం మార్క్ కనిపించేది. పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా కూడా కాపీ మరక తప్పించి ఆ సినిమా కూడా త్రివిక్రం స్కూల్ ఆఫ్ సినిమా అనే అనిపించింది. కానీ గుంటూరు కారం మాత్రం అలా లేదు. అక్కడక్కడ మెరుపులు తప్ప గుంటూరు కారం త్రివిక్రం డైరెక్షన్ చేసిన సినిమా అంటే ఒకటికి రెండు సార్లు డౌట్ పడే పరిస్థితి వచ్చింది.

మహేష్ మేనియాతో సినిమా పర్వాలేదు అన్నట్టు అనిపించినా గుంటూరు కారం విషయంలో త్రివిక్రం అన్ని కోణాల్లో ఫెయిల్ అయ్యాడు. అందుకే సినిమా చూసిన ప్రతి ఒక్కరు త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రం ఇలా టాప్ 2, 3 స్థానాల్లో ఉంటూ వచ్చిన త్రివిక్రం గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత తన ప్లేస్ కోల్పోయాడని చెప్పొచ్చు. స్టార్ డైరెక్టర్ అంటే కథ, కథనాల్లో తన ముద్ర చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా వర్క్ అవుట్ కాకపోయినా డైరెక్టర్ గా అతను ఫ్లాప్ అవ్వకూడదు. కానీ మహేష్ గుంటూరు కారం విషయంలో మిస్టేక్ మొత్తం త్రివిక్రం వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. కారణాలు ఏవైనా త్రివిక్రం టార్గెట్ మిస్ అయ్యింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ నుంచి అతని ప్లేస్ మారిపోయిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News