స్టార్ కిడ్స్‌ని కొట్టేలా బుల్లితెర నటి ఆదాయం?
జన్నత్ జుబేర్ అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఆగా-ది వార్నింగ్, లవ్ కా ది ఎండ్, హిచ్కీ చిత్రాలు వీటిలో చెప్పుకోదగినవి. చాలా మ్యూజిక్ వీడియోలలోను జేబేర్ భాగమైంది.
జాన్వీ కపూర్.. సారా అలీఖాన్.. అనన్య పాండేలను మించిన ఫాలోయింగ్ ఉన్న ఒక గొప్ప టీవీ నటి గురించి మీకు తెలుసా? ఆమె పేరు జన్నత్ జుబేర్ రహ్మానీ.. భారతీయ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన.. అతి పిన్న వయస్కురాలైన నటి ఈ ప్రతిభావని. ఈ భామ సోషల్ మీడియాల ఆదాయం ఏడాదికి 25 కోట్లు అంటే షాకవ్వాల్సిందే. మీడియా ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లో ఫోర్బ్స్ జాబితాను అలంకరించిన రేర్ రికార్డ్ జన్నత్ సొంతం. ఫుల్వా, భరత్ కా వీర్ పుత్ర- మహారాణా ప్రతాప్ సహా అనేక టీవీ షోలతో పాపులరైంది. 2010 `దిల్ మిల్ గయే`తో చిన్నతనంలో తన నటనా రంగ ప్రవేశం చేసిన జన్నత్ జుబేర్ అమాయకమైన లుక్స్ .. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో బాగా ప్రాచుర్యం పొందింది.
జన్నత్ జుబేర్ అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఆగా-ది వార్నింగ్, లవ్ కా ది ఎండ్, హిచ్కీ చిత్రాలు వీటిలో చెప్పుకోదగినవి. చాలా మ్యూజిక్ వీడియోలలోను జేబేర్ భాగమైంది. నట వృత్తితో పాటు జన్నత్ జుబైర్ గొప్ప ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో 41 మిలియన్ల మంది అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. జన్నత్ నిరంతరం ఆసక్తికరమైన రీల్స్ - అందమైన పోస్ట్‌లతో తన అభిమానులను .. అనుచరులను అలరిస్తూనే ఉంది.
జుబేర్ తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌కు ఎంత వసూలు చేస్తుందో తెలుసా? పలు బాలీవుడ్ మీడియాల కథనాల ప్రకారం, జన్నత్ రూ. ఒక్కో పోస్టుకు 1.5 లక్షలు అందుకుంటోంది. కేవలం 22 వయసుకే కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఇన్ స్టా మాధ్యమంలో కళ్ల జూస్తోంది. ఇతర మాధ్యమాల్లో యాడ్ పోస్టుల ద్వారా లక్షల్లో ఆర్జిస్తోంది. ఈ భామకు ఖరీదైన ఇల్లు విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
పాతిక అయినా నిండకుండానే:
22 ఏళ్లకే జన్నత్ జుబేర్ నికర విలువ 250+ మిలియన్లు. జన్నత్ జుబైర్ ఖత్రోన్ కే ఖిలాడీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 18 లక్షలు వసూలు చేసిన స్టార్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మిలియన్ల విలువైన అభిమానుల ఫాలోయింగ్‌ను ఆస్వాధిస్తోంది. జన్నత్ 2010లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కలర్స్ టీవీ షో ఫుల్వాలో టైటిల్ రోల్ ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల మంది ఫాలోవర్లతో విజయవంతమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఫుల్వా లో జన్నత్ పాత్ర లక్షలాదిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది భారతదేశంలోని అత్యంత పాపులర్ బాల నటులలో ఒకరిగా మారింది. అద్భుత విజయాలతో భారతీయ టెలివిజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే తారలలో ఒకరిగా జుబేర్ ఉంది. 2022లో కుల్చే చోలే అనే చిత్రంతో పంజాబీ రంగ ప్రవేశం చేసింది. 2018లో రాణి ముఖర్జీ హిచ్కీలోను నటించింది.
లగ్జరీ కార్లు సొంతం:
1.2 కోట్ల విలువైన సెడాన్- దాదాపు 95 లక్షల విలువైన రెండు SUVలు జన్నత్ కు ఉన్నాయి. ఆమెకు ఒక అందమైన ఇల్లు కూడా ఉంది. ఈ నటి యూట్యూబ్ -ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా చాలా బ్రాండ్లకు ప్రచారం చేస్తోంది. అందం, ఆరోగ్యం, ఫ్యాషన్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన చాలా భారతీయ బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉంది.
జన్నత్ జుబేర్ ఇన్స్టాగ్రామ్ ఖాతా రోజువారీ ఆదాయానికి ప్రధాన వనరు. ఒక్కో పోస్ట్‌కు భారీగా వసూలు చేస్తోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 46 మిలియన్లకు పైగా ఫాలోయింగ్ ని కలిగి ఉంది. సారా అలీ ఖాన్ (42.9 మిలియన్లు), జాన్వీ కపూర్ (21.8 మిలియన్లు), అనన్య పాండే (24.5 మిలియన్లు) సహా బాలీవుడ్ స్టార్ కిడ్స్ను మించి ఫాలోయింగ్ ఉన్న నటిగా జన్నత్ పేరు మార్మోగుతోంది. జన్నత్ జుబైర్ తన చలనచిత్ర అరంగేట్రం కోసం ఒక పెద్ద నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు కథనాలొచ్చాయి.