ఉపాసన కొణిదెల గురించి మీకెంత తెలుసు?
ప్రస్తుతం ఉపాసన బర్త్ డే సీడీపీ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది
ఉపాసన కొణిదెల.. అపోలో సంస్థానాధీశురాలిగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ప్రపంచానికి సుపరిచితం. వ్యక్తిగతంగా వృత్తిగతంగా అందరూ మెచ్చే పాపులర్ సెలబ్రిటీ. నేటితరంలో అసాధారణ ఎంటర్ ప్రెన్యూర్ గా కష్ఠతర బాధ్యతల్ని నెరవేరుస్తున్న ప్రతిభావని. ఉపాసనకు వృత్తిపరంగా బరువు బాధ్యతలు అపారం. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్.. అపోలో URLife వైస్-ఛైర్ పర్సన్ .. అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ .. ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ TPA లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా బృహత్తర బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు. ఆరోగ్యం - ఫిట్ నెస్ కు సంబంధించిన సమాచారాన్ని అందించే హెల్త్ కేర్ - వెల్ నెస్ వెబ్ సైట్ బి పాజిటివ్ కి యజమాని.. ఎడిటర్-ఇన్-చీఫ్.
ఉపాసన కామినేని కొణిదెల నెక్స్ట్-జెన్ ఎంటర్ ప్రెన్యూర్..జంతు సంరక్షకురాలు.. అపోలో హాస్పిటల్స్ కుటుంబానికి చెందిన విశిష్ట-పరోపకారి. సమాజానికి తిరిగి ఇవ్వాలని నమ్మే అర్థవంతమైన ప్రభావాన్ని చూపించే వ్యాపారాలను సృష్టించాలని ఉపాసన నమ్ముతారు. భారతీయ శ్రామిక శక్తి వారి ఉత్పాదకతను పెంచడం కోసం ఉపాసన URLifeని ప్రారంభించారు.
కార్పొరేట్ ఇండియా ఉత్పాదకతను పెంచడంలో సహాయపడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ శ్రేయస్కర పద్ధతులను అనుసరించే మేధావి. ప్రత్యామ్నాయ ఔషధం.. వైద్యం లో జ్ఞానాన్ని అన్వేషించడం ద్వారా ప్రపంచం #HEALININDIA ని పాపులర్ చేసిన మేటి ప్రతిభావని.
అపోలో URLife దేశంలో అత్యధిక సంఖ్యలో ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ లను కలిగి ఉంది. URLife వెల్ నెస్ స్పేస్ లో ప్రయోగాలతో అద్భుత ప్రశంసలు అందుకుంది. మహమ్మారి సమయంలో అపోలో హెల్త్ మ్యాగజైన్ ని నిలిపివేసి.. విస్తృతంగా రీడర్ కి చేరుకోవడానికి డిజిటల్ మార్గాన్ని అనుసరించారు. URLifeగా రీబ్రాండ్ చేయడం తెలిసినదే. ఈ వేదికపై ఆకర్షణీయమైన కంటెంట్ ను అందిస్తున్నారు. ఇంతటి కీలకమైన విభాగానికి ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉపాసన కొణిదెల.. 20 జూన్ 2023న హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. చరణ్ - ఉపాసన దంపతులు తమ కుమార్తెకు క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు. ఇది హిందూ మతంలోని పవిత్ర మంత్రమైన లలితా సహస్రనామం నుండి ప్రేరణ పొందింది.
కుమార్తె జననం అనంతరం ప్రపంచంలోని నంబర్ వన్ కుబేరుడు ముఖేష్ అంబానీ - నీతా అంబానీ దంపతులు ఈ జంటకు రూ. 1 కోటి విలువైన విపరీతమైన బంగారు ఊయలని కానుకగా ఇచ్చారని కూడా ప్రచారం ఉంది. వృత్తిపరంగా సంక్లిష్టమైన బాధ్యతల్ని నెరవేరుస్తూ యువతరానికి రోల్ మోడల్ గా ఉన్న ఉపాసన బర్త్ డే నేడు (20 జూలై).. ఈ సందర్భంగా 'తుపాకి' శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉపాసన బర్త్ డే సీడీపీ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.