అత్త‌య్య ను చూసి కోడ‌లు నేర్చుకున్న‌వి ఇవే!

మ‌రి భార్య భ‌ర్త‌ల సంగ‌తి పక్క‌న‌బెట్టి అత్తా-కోడ‌ళ్లు ఇంట్లో ఎలా ఉంటారు? అత్త సురేఖ‌ని చూసి కోడ‌లు ఉపాస‌న ఏం నేర్చుకున్నారు? అంటే చాలా సంగ‌తులే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆ విశేషాలు ఉపాసన మాట‌ల్లోనే..

Update: 2024-03-08 06:30 GMT

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ని పెళ్లాడిన త‌ర్వాత ఉపాస‌న బిజినెస్ ఉమెన్ నుంచి కొత్త బాధ్య‌త‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కి వైఫ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే బిజినెస్ రంగంలోనూ దూసుకు పోతున్నారు. ఇటీవ‌లే ఆ దంప‌తుల‌కు పండండి ఆడ‌బిడ్డ క్లీంకార కూడా జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా ముగ్గురు ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లైన త‌ర్వాత చ‌ర‌ణ్ వేరు కాపురం పెట్ట‌డంతో జీవితంలో కొత్త బాధ్య‌త‌లు తెలుసుకుని ప్ర‌యాణం సాగిస్తున్నారు.

ఇటీవ‌లే భార్య‌పై త‌న‌కున్న ప్రేమ‌నంత‌ట‌ని ఉపాస‌న కాళ్లు నొక్కుతు చాటారు. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ ఒక్క వీడియోతో ఉపాస‌న అంటే ఎంత ఇష్ట‌మో అర్ద‌మైపోయింది. అది చూసి మెగా అభిమానులు అంతే మురిసిపోయారు. మ‌రి భార్య భ‌ర్త‌ల సంగ‌తి పక్క‌న‌బెట్టి అత్తా-కోడ‌ళ్లు ఇంట్లో ఎలా ఉంటారు? అత్త సురేఖ‌ని చూసి కోడ‌లు ఉపాస‌న ఏం నేర్చుకున్నారు? అంటే చాలా సంగ‌తులే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆ విశేషాలు ఉపాసన మాట‌ల్లోనే..

'వంటలు నేర్చుకోవటం ఒకటి. కుటుంబ విలువలు నేర్చుకోవటం మరొకటి. అత్తమ్మ- ఈ రోజుకి ఇంట్లో అందరూ తింటే తప్ప తను తినదు. నాకు పెళ్లైన కొత్తల్లో తనని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ తర్వాత ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి తాను ఒక ఇరుసు ఎందుకైందో నాకు అర్థమయింది. అంతే కాదు... తన వడ్డన కూడా చాలా అప్యాయంగా ఉంటుంది. నాకు ఒక పద్ధతిగా తినటం తనే నేర్పించింది. ఒకప్పుడు నేను ముందు పెరుగు తిని- ఆ తర్వాత మిగిలినవి తినేదాన్ని.

కానీ నాకు అత్తమ్మ- ముందు పప్పు ..ఆ తర్వాత కూర.. ఆ తర్వాత పచ్చడి.. ఆ తర్వాత పెరుగు తినటం నేర్పించింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే- మన ముందు తరం వారిలో ఉన్న మంచిని నేర్చుకోవాలి. మొత్తం కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద- అందరూ ఏం తింటారో.. ఎవరికి ఏది ఇష్టమో అత్తమ్మకు తెలుసు. మూడు రోజుల క్రితం- కళ్యాణ్‌గారు ఇంటికి వచ్చారు. వస్తారని తెలిసి ఆయనకు ఇష్టమైన బిర్యానీ చేయించారు. ప్రతి రోజు ఏదో ఒక వంట- ఎవరో ఒకరికి వెళ్తూనే ఉంటుంది' అని అన్నారు.

Tags:    

Similar News