దళపతి విజయ్ నిర్ణయం అద్భుతం: ఉపాసన
తాజా ఇంటర్వ్యూలో ఉపాసన కామినేని ఆట్లాడుతూ..'' ఇన్నాళ్లు సినిమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న విజయ్ ఒక అద్భుతం''అని ఉపాసన కామినేని ప్రశంసించారు.
సినీహీరో, ఇలయదళపతి విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడమే గాక 'తమిళగ వెట్రి కజగం' పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయ్ కి సినీరాజకీయ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. డిఎంకే అధినేత, యువహీరో ఉదయనిధి స్టాలిన్ సైతం శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పుడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని విజయ్ నిర్ణయాన్ని స్వాగతించారు. అతడు నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారడాన్ని ప్రశంసించారు. విజయ్ తన చివరి చిత్రం 'దళపతి 69' తర్వాత 2026 తమిళనాడు రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే క్రమంలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించాడు. తమిళగ వెట్రి కజగం అతడి పార్టీ పేరు.
విజయ్ రాజకీయ ప్రవేశం ప్రకటన వెలువడినప్పటి నుండి నెటిజనుల్లో ఇది ఎక్కువగా చర్చనీయాంశమైంది. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన కామినేని ఆట్లాడుతూ..'' ఇన్నాళ్లు సినిమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న విజయ్ ఒక అద్భుతం''అని ఉపాసన కామినేని ప్రశంసించారు. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారినందుకు శుభాకాంక్షలు చెబుతూ.. తన మామ చిరంజీవి .. చిన మామ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఉటంకించారు.
దక్షిణాదిలోపలువురు ముఖ్యమంత్రులు సినిమా రంగం నుంచి వచ్చిన వారు కావడంతో విజయ్ పెద్ద అడుగు వేశారని ఆమె భావిస్తున్నారు. అనంతరం ఉపాసన కామినేని మాట్లాడుతూ.. తమిళనాడులో కొత్త మార్పు రావాలని, భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు.
విజయ్ అతని పార్టీ సభ్యులు 2026 తమిళనాడు రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేస్తారు. రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన స్వరాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నారు. విజయ్ తన సినీ ప్రయాణాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2026 రాష్ట్ర ఎన్నికలకు ముందు 'దళపతి 69' అతని చివరి చిత్రం అవుతుంది.