హాట్ బ్యూటీకి చంపేస్తామని బెదిరింపులు

సినిమాలతో కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్

Update: 2023-10-31 09:11 GMT

సినిమాలతో కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. ఈమె ధరించే కాస్ట్యూమ్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. ఈమె ప్రతి ఔట్ ఫిట్ కూడా వివాదం రాజేయడం లేదంటే వార్తల్లో నిలవడం జరుగుతూ ఉంటుంది. తాజాగా భూల్ భులయ్యా లోని ఛోటా పండిట్ క్యారెక్టర్ ఔట్ ఫిట్ లో కనిపించింది.


ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఉర్ఫీ ఛోటా పండిట్‌ యొక్క లుక్ లో కనిపించడం తో అంతా కూడా అవాక్కయ్యారు. ఉర్ఫీ నెటిజన్స్ కి షాక్ ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో రకరకాల ఔట్ ఫిట్స్ తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ రేంజ్‌ లో అందాల ఆరబోత అవసరమా అంటూ చాలా మంది ఆమెను విమర్శించిన వారు కూడా ఉన్నారు.

తాజాగా ఆమె ఛోటా పండిట్ క్యారెక్టర్ కి సంబంధించిన ఔట్‌ ఫిట్ ను ట్రై చేయడం తో కొందరు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారట. హిందూ ధర్మం ను నాశనం చేస్తున్నావు అంటూ ఉర్ఫీ కి కొందరు మెయిల్‌ ద్వారా హెచ్చరికలు చేశారట. ఇలాగే కంటిన్యూ చేస్తే చంపేస్తామని కూడా ఆమె ను బెదిరించారట.

రెండు రోజుల్లో మీరు అసభ్య రీతిలో సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను డిలీట్ చేయకుంటే మాత్రం మిమ్ములను చంపడం పెద్ద పని కాదు, అందుకు పెద్దగా సమయం కూడా పట్టదు అన్నట్లుగా బెదిరించాడట. దాంతో ఉర్ఫీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకు వచ్చింది. ఉర్ఫీ కి ఇలాంటి బెదిరింపులు పరిపాటే. అయితే ఈసారి చంపేస్తామంటూ సీరియస్ గా వార్నింగ్‌ ఇవ్వడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేస్తుందనే టాక్‌ వినిపిస్తోంది.

Tags:    

Similar News