అల్లు అర్జున్‌కి రెండో జాతీయ అవార్డు రాబోతుంది : ఊర్వశి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో ఓ ఊపు ఊపేస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో ఓ ఊపు ఊపేస్తోంది. వీక్ డేస్‌లోనూ, వీకెండ్ లోనూ ఎప్పుడూ పుష్ప 2 కి ఉత్తర భారతంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాల రికార్డులు అన్నింటిని బ్రేక్ చేస్తూ భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకు పోతున్న పుష్ప 2 పై బాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉంటే, కొందరు మాత్రం అక్కసుతో కడుపులో నిప్పులు పోసుకున్నట్టు తమ అసూయను వెళ్లగక్కుతున్నారు. మొత్తానికి పుష్ప 2 ను హిందీ ప్రేక్షకులు తెగ ఆదరిస్తున్నారు. కచ్చితంగా మరింత భారీ విజయాన్ని పుషప 2 అక్కడ దక్కించుకోబోతుంది.
పుష్ప కి బాలీవుడ్ నుంచి పలువురి మద్దతు లభించింది. కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు స్పందిస్తూ పుష్ప 2 సినిమా హిందీలో సాధించిన విజయానికి షాక్ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, తెలుగు ప్రేక్షకులకు ఐటెం సాంగ్స్‌తో సుపరిచితం అయిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఈ సినిమాపై చాలా పాజిటివ్‌గాత న అభిప్రాయంను వ్యక్తం చేసింది. సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేసింది. సినిమాలోని ప్రతి ఒక్కరి నటన సూపర్ అంటూ ఊర్వశి అభినందనలు తెలియజేసింది.
సినిమాలోని జాతర సన్నివేశం చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ నటన కొత్త ఎత్తులకు ఎక్కినట్లుగా ఆ జాతర సీన్ పండింది. ఆ సీన్‌లోని అత్యుత్తమ ప్రదర్శనకు, అద్భుతమైన నటనకు రెండో సారి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం కలుగుతుంది. తప్పకుండా సినిమాతో జాతీయ స్థాయిలో మరింత సత్తా చాటుతున్నారు. సినిమా టీం మెంబర్స్ అందరికీ అభినందనలు తెలియజేశారు. ఊర్వశి వ్యాక్యలపై హిందీ ప్రేక్షకులు కొందరు పాజిటివ్‌గా కామెంట్ చేస్తే కొందరు మాత్రం జాతీయ అవార్డు స్థాయిలో బన్నీ నటన ఎలా ఉందని నువ్వు అనుకుంటున్నావు అంటూ విమర్శలు చేస్తున్నారు.
అల్లు అర్జున్‌కి మరోసారి జాతీయ అవార్డు రావడం ఖాయం అంటూ చాలా మంది అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది. పుష్ప సినిమాలోని నటనతో పోల్చితే రెండు మూడు రెట్లు అధికంగా అత్యుత్తమంగా అల్లు అర్జున్ నటించి కష్టపడ్డారు. కనుక మరోసారి అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు రావడం పక్కా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అల్లు అర్జున్‌కి మాత్రమే కాకుండా సినిమాకు రెండు మూడు జాతీయ అవార్డులు రావాల్సిందే అంటూ అల్లు ఫ్యాన్స్ అంటున్నారు.