'బేబి' బ్యూటీ మాటకే ఓటేసిన కావ్య!
తాజాగా కావ్య కూడా వైష్ణవి మాటకే ఓటేసింది. 'నటిగా నా ప్రయాణం బాగుంది.
ప్రయత్నిస్తే తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఎందుకు రావు? అన్నది 'బేబి' బ్యూటీ వైష్ణవి చైతన్య బలమైన వాదన. ఎనిమిదేళ్లు ప్రయత్నించి బేబి సినిమాతో వైష్ణవి నిరూపించుకున్న సంగతి తెలిసిందే. యూ ట్యూబర్ గా ప్రారంభమై నేడు కుర్రాళ్ల గుండెల్లో వీణ మోగించేస్తోంది. వైష్ణవికి రకరకాల ఆఫర్లు వస్తున్నట్లు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. అమ్మడు అంత డిమాండ్ చేస్తుంది? ఇంత డిమాండ్ చేస్తుందంటూ గాపిప్లు. బ్యాకెండ్ లో మెగా సపోర్ట్ కూడా కనిపిస్తుంది.
ఇదే కోవలో ప్రణవి అనే మరో తెలుగు నటి కూడా తెలుగు వాళ్లకు అవకాశాలు వస్తాయి. అవి ఆలస్యమ వొచ్చు అంతే తేడా అంది. ఎంతకాలం అని పరభాష నటులపై ఆధారపడతారు? తెలుగు వాళ్లకు ఓ టైమ్ వస్తుంది. అప్పుడు తప్పక అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేసింది. తాజాగా కావ్య కూడా వైష్ణవి మాటకే ఓటేసింది. 'నటిగా నా ప్రయాణం బాగుంది. 'మసూద'..'బలగం'..ఇప్పుడు 'ఉస్తాద్' ముగ్గురు దర్శకులు తమ పాత్రలకి తెలుగు అమ్మాయి కావాలనుకున్నారు.
అలా నాకు ఈ అవకాశాలు వచ్చాయి. ఆ కోణంలో తెలుగు అమ్మాయి అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. భాష వస్తేనే ఛాన్స్ వస్తుందని కాదు. నటన చాలా ముఖ్యం. భవిష్యత్ లో నేను తమిళ సినిమాలు చేయోచ్చు..మలయాళ సినిమాలు చేయోచ్చు.
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదనే అంశంపై చర్చ అనవసరం అనిపిస్తుంది. శ్రీదేవి..సావిత్రి గొప్ప అవకాశాలు అందుకున్నారు. విజయాలు అందుకుని ఎప్పుడో తమని తాము నిరూపించుకున్నారు.
దర్శకులకు ఫలానా పాత్రకు తెలుగు అమ్మాయి సూటవుతుందంటే తప్పకుండా వాళ్లనే పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ల ఛాయిస్ అనేది ముఖ్యం. వాళ్లు రాసుకున్న కథని బట్టి ఉంటుంది. తెలుగు వాళ్లకు ఇక్కడ మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. కొత్త వాళ్లని బాగా ప్రోత్సహి స్తున్నారు. ప్రతిభ ఉన్న వారంతా సక్సెస్ అవుతున్నారు. ఆ రకంగా మనం సన్నదం కావడం అన్నది అతి ముఖ్యమైన అంశం' అని అంది.