రివ్యూ : వధువు (వెబ్ సీరీస్)

Update: 2023-12-11 05:55 GMT

రివ్యూ : వధువు (వెబ్ సీరీస్)

నటీనటులు : అవికా గోర్‌, నందు, అలీ రెజా, రూపాలక్ష్మి, మాధవి ప్రసాద్‌, శ్రీధర్‌ రెడ్డి, సురభి దీప్తి తదితరులు

సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి

సినిమాటోగ్రఫీ: రామ్‌ కె. మహేష్

నిర్మాతలు: శ్రీకాంత్‌ మొహ్తా, మహేంద్ర సోనీ

దర్శకత్వం: పోలూరు కృష్ణ

బెంగాళి హిందీ సీరీస్ ఇందుని తెలుగులో వధువు గా రీమేక్ చేశారు. అవికా గోర్, నందు, అలి రెజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సీరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజైంది. ఈ సీరీస్ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

బాగా చదువుకుని తెలివైన అమ్మాయి అయిన ఇందు (అవికా గోర్) పెద్దలు నిశ్చయించిన పెళ్లికి ఓకే చెబుతుంది. పెళ్లి పీటల మీద ఉండగా వరుడుతో ఇందు చెల్లి వెళ్లిపోతుంది. అది జరిగిన ఏడాది తర్వాత ఇందుని ఆనంద్ (నందు)కి ఇచ్చి పెళ్లి చేస్తారు. అత్తగారింటికి వెళ్లిన ఇందుకి అక్కడ అంత సౌకర్యంగా ఉండదు. ఇందు తమ్ముడు ఆర్య (అలి రెజా)కి అప్పటికే పెళ్లైందన్న విషయం తెలుస్తుంది. ఆర్య వైఫ్ వైష్ణవి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఇందుకి కనిపించకుండా ఆనంద్ వాళ్ల పెద్దమ్మ కూతుర్ని ఎందుకు దాచి ఉంచుతారు. ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ఇందు ఎలా కనిపెట్టింది అన్నది వెబ్ సీరీస్ కథ.

కథనం - విశ్లేషణ :

ఈమధ్య కాలంలో వెబ్ సీరీస్ లు కూడా సినిమాకు ఈక్వల్ క్వాలిటీతో వస్తున్నాయి. జోనర్ ఏంటన్నది కాకుండా మంచి స్టోరీ టెల్లింగ్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తో వెబ్ సీరీస్ లు వస్తున్నాయి. అలాంటి సీరీస్ లలో వధువు ఒకటి. ట్రైలర్ తోనే వెబ్ సీరీస్ పై ఆసక్తి కలిగించారు. సీరీస్ మొదలు పెట్టిన విధానం ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేయగలిగారు. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కలిగేలా చేశారు.

కథకు తగినట్టుగా ఈ సీరీస్ అంతా డార్క్ టోన్ లో ఉంటుంది. అది సీరీస్ పై మంచి ఇంప్యాక్ట్ క్రియేట్ చేసింది. అయితే మధ్యలో కొత్త స్లో అవ్వడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది. 7 ఎపిసోడ్స్ తో వచ్చిన వధువు వెబ్ సీరీస్ 1, 2 రెండు ఎపిసోడ్స్ ఎంగేజ్ చేయగా 3, 4, 5 ఎపిసోడ్స్ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి. 6వ ఎపిసోడ్ మళ్లీ గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. కొన్ని పాత్రలు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయో సరైన క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని సీన్స్ అవసరం లేదని కూడా అనిపిస్తుంది.

వెబ్ సీరీస్ లో ముఖ్యంగా ఈ సస్పెన్స్ జోనర్ సీరీస్ లలో కొన్ని ట్విస్ట్ లు ఊహిస్తాం. కానీ ఈ సీరీస్ లో అలాంటి షాక్ ఇచ్చే ట్విస్ట్ లు లేవు. సీరీస్ ఎండ్ కి వస్తుందనగా కొంత క్లారిటీ ఇచ్చినా అసలైన కథ సెకండ్ సీజన్ లో ఉంటుందని చెప్పారు. వధువు మొదటి సీజన్ మొత్తం సెకండ్ సీజన్ కి ఫౌండేషన్ లానే ఉపయోగపడింది. మంచి కాస్టింగ్ దానితో పాటుగా వారి మంచి పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్ ఆడియన్స్ కి రీచ్ అవుతాయి. వధువు మొదటి సీజన్ ని అసంతృప్తిగానే వదిలేసి రెండో సీజన్ కోసం ఎదురుచూసేలా చేసింది.

నటీనటులు :

సినిమాల్లో మెప్పిస్తూ వచ్చిన అవికా గోర్ ఈమధ్య వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తుంది. వధువు సీరీస్ లో లీడ్ రోల్ గా సీరీస్ మొత్తం నడిపించింది అవికా గోర్. సీరీస్ లో స్ట్రాంగ్ రోల్ లో కనిపించింది. ఇచ్చిన పాత్రకు తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. అలి రెజా కు మంచి స్క్రీన్ టైం దొరికింది. దాన్ని అతను బాగా యూస్ చేసుకున్నాడు. అయితే డబ్బింగ్ ఎందుకో అంతగా సూట్ అవ్వలేదు. నందు ఎప్పటిలానే డీసెంట్ రోల్ చేశాడు. ఇక మిగ్తా కాస్ట్ అంతా కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

వధువు వెబ్ సీరీస్ కి సినిమాటోగ్రఫీ సపోర్ట్ బాగుంది. సీరీస్ మొదటి నుంచి ఆడియన్స్ ని ఆ మూడ్ లోకి తీసుకెళ్లేలా కెమెరా వర్క్ ఉంది. రాం కె మహేష్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. శ్రీరాం మద్దూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు అనుగుణంగా ఉంది. సస్పెన్స్ ఫ్యాక్టర్ కి కావాల్సిన మ్యూజిక్ అందించారు. అయితే కొన్ని సౌండ్స్ రిపీట్ అయ్యాయని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే సీరీస్ పై ఇంకాస్త ఇంప్యాక్ట్ ఉండేది. డైలాగ్స్ కొన్ని డ్రమెటిక్ గా అనిపిస్తాయి. పోలురు కృష్ణ సీరీస్ ని ఎంచుకోవడంలో సక్సెస్ అయినా అక్కడక్కడ బోర్ కొట్టించాడని మాత్రం చెప్పొచ్చు. వధువు సీజన్ 1 క్లైమా స్కూడా ఇంప్రెస్ చేయలేదు. చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. మొత్తం మీద డైరెక్టర్ జస్ట్ ఓకే అనిపించేలా వెబ్ సీరీస్ చేశాడు.

బాటం లైన్ : వధువు.. జస్ట్ ఓకే..!

Tags:    

Similar News