.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ప‌క్ష‌వాతానికి గురైన స్టార్ క‌మెడియ‌న్!

వ‌డివేలుతో వెంగ‌ళ‌రావ్ ప్రయాణం ఎంతో సుదీర్ధ‌గ‌మైన‌ది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో చాలా సినిమాలున్నాయి. దాదాపు 30 సినిమాల్లో క‌లిసి న‌టించారు.

Update: 2024-06-29 23:30 GMT

కోలీవుడ్ హాస్య న‌టుడు వెంగ‌ళ‌రావు దీన స్థితిలో ఉన్నారు. క‌మెడియ‌న్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న వెంగ‌ళ‌రావు కొన్నేళ్ల‌గా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. దీనితోడు ఆర్దిక ఇబ్బందులు ఎదుర‌వ్వ‌డంతో సాయం కోసం ఎదురుచూసే ప‌రిస్థితులు ఉన్నారు. చికిత్స కి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఓ వీడియో రిలీజ్ చేసారు.

అందులో ఆయ‌న‌కి కాలు, చేయి ప‌క్ష‌వాతానికి గురైన‌ట్లు తెలుస్తోంది. ప‌నిచేసే స్థితిలో లేన‌ని, చికిత్స‌కు ఎవ‌రైనా సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో కొంత మంది త‌మిళ న‌టులు ముందుకొచ్చారు. శింబు రెండు ల‌క్ష‌ల స‌హాయం చేసాడు. న‌టి ఐశ్వ‌ర్యా రాజేష్ 25000 వేలు అందించారు. అలాగే మ‌రో క‌మెడియ‌న్ వ‌డివేలు ల‌క్ష రూపాయాలు ఆర్దిక సాయం చేసారు. అంతేకాదు స్వ‌యంగా ఆయ‌న ఇంటికెళ్లి ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వ‌డివేలుతో వెంగ‌ళ‌రావ్ ప్రయాణం ఎంతో సుదీర్ధ‌గ‌మైన‌ది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో చాలా సినిమాలున్నాయి. దాదాపు 30 సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఆ కాంబోలో సీన్స్ అంటే ప్రేక్ష‌కుల‌కు పొట్ట చెక్క‌ల‌వ్వాల్సిందే. అంత అద్భుతంగా వాళ్లిద్ద‌రి మ‌ధ్య హాస్యం పండేది. టాలీవుడ్ లో కోట శ్రీనివాస‌రావు- బాబు మోహ‌న్ కాంబినేష‌న్ ఎంత స‌క్సెస్ అయిందో కోలీవుడ్ లో వెంగ‌ళ‌రావ్-వ‌డివేలు అంత‌గా స‌క్సెస్ అయ్యారు. అందుకే వాళ్లిద్ద‌రి కాంబో అంటే ఎంతో ప్ర‌త్యేక‌మైన‌దిగా ప్రేక్ష‌కులు భావిస్తారు.

వెంగ‌ళ‌రావు తొలుత ఇండ‌స్ట్రీకి స్టంట్ మాస్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత న‌టుడిగా అవ‌కాశం రావ‌డంతో కొత్త ప్ర‌యాణం మొదలు పెట్టారు. క‌మెడియ‌న్ గా స‌క్స‌స్ అవ్వ‌డంతో న‌టుడిగా మంచి గుర్తింపు ద‌క్కింది. కాంత స్వామి, త‌లైన‌గ‌రం, ప‌గిరి ఇలా చాలా సినిమాలు చేసారు.

Tags:    

Similar News