వైష్ణవి చైతన్య.. బేబీ తెచ్చిన ఆనందంతో మరింత అందం..

వైష్ణవి చైతన్య తన సినీ కెరీర్‌ను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలుపెట్టి, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది

Update: 2024-08-06 07:21 GMT

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల సంఖ్య లెక్కపెట్టలేనంత ఉంది. గ్లామర్ ప్రపంచంలో పోటీగా ఉండడం అంటే అంత మామూలు విషయం కాదు. టాలెంట్ తో పాటు అందం లక్కు కూడా సమపాళ్లలో ఉండాలి అంటారు. ఇక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిన వైష్ణవి చైతన్య లాంటి నూతన నటీమణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

వైష్ణవి చైతన్య తన సినీ కెరీర్‌ను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలుపెట్టి, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. కానీ, ఆమెకు నిజమైన బ్రేక్ 2023లో విడుదలైన "బేబీ" సినిమాతోనే వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను మించి ఘన విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడంతో పాటు, వైష్ణవికి తెలుగులో ఒక మంచి పేరును తెచ్చిపెట్టింది.

"బేబీ" సినిమా కేవలం కమర్షియల్‌గా మాత్రమే కాకుండా, అవార్డుల రూపంలో కూడా విజయాన్ని సాధించింది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం విశేషం. అందులో ముఖ్యంగా వైష్ణవి చైతన్యకు "ఉత్తమ నటిగా" అవార్డు దక్కడం విశేషం. మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది.

ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్‌లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన వైష్ణవి, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా ఒక గొప్ప ప్రస్థానం. ఇక "బేబీ" సినిమా తర్వాత వైష్ణవి కెరీర్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. రీసెంట్‌గా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో "లవ్ మీ" అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో కూడా ఆమె హీరోతో సమానంగా ఉండే పాత్రను పోషించింది. ఆ క్యారెక్టర్ ద్వారా కూడా నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఆమెకున్న క్రేజ్ మరింత పెరగడంతో, ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ వైష్ణవి ప్రధాన పాత్రలో నటించే అవకాశం అందుకుంది. వైష్ణవి చైతన్య మొదటి సినిమా నుంచే నటనలో అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. ఇక ఆమెకు వచ్చే అవకాశాలు, ఈ పరిశ్రమలో ఆమె స్థానం మరింత బలోపేతం చేసే అవకాశముంది. మరి అమ్మడి కథల సెలెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News