వరలక్ష్మి శరత్ కుమార్.. రెమ్యునరేషన్ గట్టిగానే..

దీంతో వరలక్ష్మి సంక్రాంతి స్టార్ అయిపొయింది. మరోవైపు ఆమె ఇప్పటి వరకు 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. హనుమాన్ సక్సెస్ తో కోటి రూపాయిలు డిమాండ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Update: 2024-01-16 07:30 GMT

వరలక్ష్మి శరత్ కుమార్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. దానికి కారణం ఆమె చేస్తోన్న సినిమాలలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉండటమే. హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి తరువాత రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటే ప్రయత్నం చేసింది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా తమిళ్, మలయాళీ, కన్నడ భాషలలో సినిమాలు చేస్తూ వచ్చింది.

పందెం కోడి 2 సినిమాతో వరలక్ష్మి విలన్ గా ట్రై చేసి సక్సెస్ అందుకుంది. తరువాత విజయ్ సర్కార్ మూవీలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. తెనాలి రామకృష్ణన్ సినిమాతో టాలీవుడ్ లోకి వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెట్టింది. ఈ సినిమా సక్సెస్ అందుకోలేదు. అయితే రవితేజ క్రాక్స్ తో సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

2021 సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. తరువాత 2022 సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత ఆమెకి తెలుగులో ఛాన్స్ లు పెరిగాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ఇందులో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రని ఆమె సొంతం చేసుకుంది. ఇలా సంక్రాంతి బరిలో ఆమె మూడుసార్లు వస్తే మూడు హిట్ అయ్యాయి. దీంతో వరలక్ష్మి సంక్రాంతి స్టార్ అయిపొయింది. మరోవైపు ఆమె ఇప్పటి వరకు 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. హనుమాన్ సక్సెస్ తో కోటి రూపాయిలు డిమాండ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

టాలీవుడ్ లో పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్స్ చేసే వారు తక్కువ అయిన నేపథ్యంలో వరలక్ష్మికి మరిన్ని అవకాశాలు పెరగడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో శబరి అనే మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తాజాగా కూర్మ నాయకి అనే మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

Tags:    

Similar News