థాయ్‌ లో అంజమ్మ పెళ్లి ఏర్పాట్లు..!

తమిళ సీనియర్ స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ కుమార్తె అయిన వరలక్ష్మి శరత్‌ కుమార్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

Update: 2024-05-29 06:04 GMT

సౌత్‌ లో హీరోల వారసులుగా ఎక్కువ శాతం మంది హీరోలుగా మాత్రమే ఉన్నారు. చాలా తక్కువ మంది వారసులు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరు వరలక్ష్మి శరత్‌ కుమార్‌. తమిళ సీనియర్ స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ కుమార్తె అయిన వరలక్ష్మి శరత్‌ కుమార్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరోయిన్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఎక్కువ శాతం విలన్‌ రోల్స్‌ చేసింది, ఇప్పటికి కూడా వాటినే చేస్తుంది. ఆమె కు లేడీ విలన్ అనే ట్యాగ్‌ వచ్చింది. తమిళ మరియు తెలుగు లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది.

టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ హనుమాన్ లో హీరో అక్క పాత్ర అయిన అంజమ్మ పాత్రలో నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగిన విషయం తెల్సిందే. చాలా కాలంగా ప్రేమిస్తున్న నికోలాయ్‌ సచ్‌దేవ్‌ తో జులై 2న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వివాహం జరుగబోతుంది.

వీరి వివాహం గురించి తమిళ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రచారం థాయ్‌ల్యాండ్‌ లో వరలక్ష్మి శరత్‌ కుమార్ మరియు నికోలాయ్ సచ్‌దేవ్‌ వివాహం వైభవంగా జరుగబోతుంది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మంది హాజరు అవ్వబోతున్నారు.

బాలీవుడ్‌ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు వరలక్ష్మి కూడా అదే తరహా మూడు రోజుల పెళ్లికి రెడీ అవుతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తానికి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వివాహ హడావుడి నెల ముందే మొదలైంది.

Tags:    

Similar News