వరుణ్ -లావణ్య ఇటలీ సీక్రెట్ ఇదా?
మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి. సాధారణంగా సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే వివిధ దేశాల్లో జరుగుతుంటాయి
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు..సన్నిహితులు..స్నేహితులు అతికొద్ది మంది సమక్షంలోనే ఈ పెళ్లి జరుగుతుంది. పెళ్లి మూడు రోజుల వేడుకలకు సంబంధించి అన్నీ అక్కడ జరుగుతున్నాయి. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది..అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో వివాహం జరుగుతుంది.
మెగా ఫ్యామిలీలో జరుగుతోన్న మొట్ట మొదటి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇది. మరి హైదరాబాద్ ..ప్రపంచంలో ఇతర దేశాలు వదిలేసి ఇటలీలోనే ఎందుకు పెళ్లి ప్లాన్ చేసారు? దీని వెనుక ఏదైనా రహస్యం గానీ..సెంటిమెంట్ గానీ ఏదైనా? ఉంటా? అంటే అత్యంత సన్నిహితుల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ అందింది. ఇటలీ పెళ్లికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు.
వరుణ్ తేజ్-లావణ్య షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్లినప్పుడు..వాళ్లిద్దరి మధ్య తొలి సన్నివేశం అక్కడే చిత్రీకరించారుట. వారి పరిచయం కూడా ఇటలీలోనే మొట్ట మొదటి సారి జరిగిందిట. ఆ పరిచయం ప్రేమ గా మారడానికి కారణం ఇటలీ అనే వాళ్లిద్దరు బలంగా నమ్ముతున్నారుట. ఈ నేపథ్యంలో ఇటలీలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఇద్దరు భావించి... ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పడం..అందుకు వాళ్లు అంగీకరించడంతోనే పెళ్లి వేదిక ఇటలీ అయిందని అంటున్నారు.
మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి. సాధారణంగా సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే వివిధ దేశాల్లో జరుగుతుంటాయి. అందులో ఇటలీ అనేది ఓ ప్యావెరెట్ ప్లేస్ కూడా. ఇక ఇండియాలో అయితే రాజాస్తాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో జరుగుతుంటాయి. దాదాపు సెలబ్రిటీల పెళ్లిళ్లు విదేశాలు కన్నా ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ వరుణ్ తేజ్-లావణ్యలు మాత్రం ఇటలీని సెంటిమెంట్ గా భావించి అక్కడికి వెళ్లారు.