మెగా విశ్వంభర… దానికోసమే ఎక్కువ హార్డ్ వర్క్

బింబిసార సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న వశిష్ట మల్లిడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా చేస్తున్నారు.

Update: 2023-11-17 05:18 GMT

బింబిసార సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న వశిష్ట మల్లిడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతోంది. దీనికి అన్ని ఏర్పాట్లు దర్శకుడు వశిష్ట చేసుకుంటున్నారు. జగదీక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ రేంజ్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర సిద్ధం అవుతోంది.

ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ విషయాలు దర్శకుడు వశిష్ట పంచుకున్నారు. విశ్వంభరలో 70 శాతం విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా ఇందులో కథ నడుస్తుందని చెప్పుకొచ్చారు. పంచభూతాలని రిప్రజెంట్ చేయడంతో పాటు త్రిశూల శక్తిని కూడా మూవీలో భాగంగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. వీటికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలక అని క్లారిటీ ఇచ్చారు. జగదీకవీరుడు అతిలోక సుందరి మూవీ సమయంలో తాను చిన్నపిల్లాడిగా ఉన్నానని అన్నారు.

మరల మెగాస్టార్ ని అలాంటి అద్భుతమైన కథలో చూపించాలని అనుకొనే విశ్వంభర కథ సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ సినిమాకి, విశ్వంభర కథకి అస్సలు పోలిక ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం అని పేర్కొన్నారు. నిజానికి సోషియో ఫాంటసీ కథలతో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఆరంభంలో యముడికి మొగుడు సినిమా చేసి హిట్ కొట్టారు.

తరువాత జగదీక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ కోడి రామకృష్ణతో అంజి మూవీ చేసిన రిలీజ్ ఇష్యూ కారణంగా ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు వశిష్టతో విశ్వంభర చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మెగాస్టార్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో చేస్తోన్న అతిపెద్ద రిస్కీ ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం విశేషం.

సైరా నరసింహారెడ్డి బయోపిక్ చేసిన అది ఆశించిన స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో ఎస్టాబ్లిష్ కాలేదు. తెలుగులో మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలు అన్ని కమర్షియల్ హద్దులలోనే తెరకెక్కాయి. విశ్వంభర మాత్రం అవుట్ ఆఫ్ లైన్ వెళ్లి మెగాస్టార్ చేస్తోన్న సినిమాగా ఉంది.

Tags:    

Similar News