టాప్ 3 లో పక్కా.. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ బాగుంది..!

బింబిసార సినిమాతో తన ప్రతిభ చాటి రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు డైరెక్టర్ వశిష్ట.

Update: 2024-08-04 23:30 GMT

బింబిసార సినిమాతో తన ప్రతిభ చాటి రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు డైరెక్టర్ వశిష్ట. విశ్వంభర టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా అనౌన్స్ చేస్తూ వచ్చిన గ్లింప్స్ తోనే వారెవా అనిపించిన మేకర్స్ సినిమాతో తప్పకుండా మరో విజువల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించేలా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతుండగా డైరెక్టర్ వశిష్ట వాటిని మరింత పెంచేలా కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ట చిరంజీవి టాప్ 10 సినిమాల్లో కాదు విశ్వంభర సినిమా టాప్ 3 లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. సినిమా అంత బాగుంటుందని. ఆడియన్స్ కు ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తామని అన్నారు వశిష్ట. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తుంది. ఐతే టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

సో మెగా ఫ్యాన్స్ అంతా కూడా వశిష్ట కామెంట్స్ తో పూనకాలు తెచ్చేసుకుంటున్నారు. ఖైదీ నంబర్ 150 తో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత వరుస సినిమాలైతే చేస్తున్నారు కానీ కొత్తగా ఏమి చేయట్లేదన్న టాక్ వినిపించింది. అందుకే వశిష్ట చెప్పిన ఈ విశ్వంభర కథను ఎంపిక చేసుకున్న చిరు సినిమా కోసం శ్రమ పడుతున్నారు.

ఈ సినిమా కోసం చిరు రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వంభర చిరు కెరీర్ లో మరో జగదేక వీరుడు అతిలోక సుందరి అవుతుందని అందరు అంటుంటే ఆ సినిమాను మర్చిపోయేలా ఉంటుందని డైరెక్టర్ కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ కు ఆమాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే కష్టమే కానీ అతను చెప్పిన రేంజ్ లో సినిమా వచ్చేలా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో రిజల్ట్ ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే అంశాలు చాలా ప్లాన్ చేస్తున్నాడట వశిష్ట. కథ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది కాబట్టి కచ్చితంగా మెగాస్టార్ కెరీర్ లో విశ్వంభర ప్రత్యేకమైన సినిమా అవుతుందేమో చూడాలి. వశిష్ట చెబుతున్న మాటలు వింటుంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దామా అన్న ఆసక్తి కలుగుతుంది.

Tags:    

Similar News