సైంధవ్.. క్యారెక్టర్స్ తోనే హైప్ పెంచేస్తున్నారుగా..
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తర్వాత చాలామంది హీరోలు కొన్ని డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తర్వాత చాలామంది హీరోలు కొన్ని డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో అతను చేస్తున్న సైంధవ్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. గతంలో ఎప్పుడు లేనంతగా వెంకటేష్ నుంచి హై వోల్టేజ్ యాక్షన్ ఈ సినిమాలో హైలెట్ కాబోతోందనీ తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్‌కి 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ చిత్రం ప్రతిభావంతులైన HITverse ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించడం విశేషం.
ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను గ్రాండ్ గా భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే షూటింగ్‌లో 8 మంది కీలక నటీనటులతో హై-ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్‌ను ముగించారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, చిత్ర నిర్మాతలు సినిమాలోని 8 ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.
వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా మరియు జయప్రకాష్ ప్రధాన తారాగణంను హైలెట్ చేశారు. కథ మొత్తం ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ప్రతిభావంతులైన నటీనటులందరినీ ఒకేసారి హైలెట్ చేసి బజ్ క్రియేట్ చేశారు. ప్రమోషన్స్ విషయంలో కూడా దర్శకుడు శైలేష్ మొదటి నుంచి కూడా విభిన్నంగా ఆలోచిస్తున్నాడు.
అంతే కాకుండా సినిమా అప్డేట్స్ పర్ఫెక్ట్ టైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఎస్ మణికందన్ కెమెరా మెన్ గా వర్క్ చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్ అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. సైంధవ్ అనేది పాన్ ఇండియా మూవీ, ఇది డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా హిందీలో కూడా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.