అనిల్ రావిపూడి - వెంకీ.. జెట్ స్పీడ్ ప్లాన్!

వరుస కమర్షియల్ విజయాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు

Update: 2024-07-02 09:27 GMT

వరుస కమర్షియల్ విజయాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా అయితే అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ దూసుకుపోతున్నారు. ప్రేక్షకులు ఎలాంటి అంశాలకు కనెక్ట్ అవుతారనేది అంచనా వేసి, వారికి కావాల్సింది ఇవ్వడం ద్వారా అనిల్ రావిపూడి సక్సెస్ సాధిస్తున్నారు.

తన కథలు అద్భుతంగా ఉంటాయనే అభిప్రాయంలో టాక్ ఎలా ఉన్నా కూడా, ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉండటం అనిల్ విజయాల మర్మం. గత ఏడాది 'భగవంత్ కేసరి' సినిమాతో బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన అనిల్, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వెంకటేష్ తో 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాలతో అనిల్ సూపర్ హిట్స్ అందుకున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేష్, దిల్ రాజు కాంబినేషన్ లో 'వెంకీ 76' అనే సినిమా కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది, ఇక జెట్ స్పీడ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం చర్చలు కొనసాగుతున్నాయి.

ఇక సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం 11.16 గంటలకు నిర్వహించనున్నారు. దిల్ రాజు SVC బ్యానర్ లో 58వ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఇక మరో స్టార్ నటుడు కూడా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

Read more!

ఇక అనిల్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇదివరకే వరుస హిట్స్ చూశాడు. టాక్ ప్రకారం అనిల్ రావిపూడి ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేశాడని సమాచారం. వరుస విజయాలు సాధిస్తూ వస్తుండటంతో పాటు, దిల్ రాజుకి ఏకంగా 5 హిట్స్ అందించిన అనిల్ డిమాండ్ కు తగ్గట్టుగా డీల్ సెట్టయినట్లు టాక్ వస్తోంది.

15 కోట్ల రెమ్యునరేషన్ అంటే అనిల్ ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మాస్ డైరెక్టర్స్ లో ఒకరుగా నిలుస్తారు. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్స్ జాబితాలో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీ, సుకుమార్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో భవిష్యత్తులో అనిల్ రావిపూడి కూడా చేరే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News

eac