వేరే లెవెల్ ఆఫీస్.. వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్..!
ఈ యాక్టర్స్ ఏం చెప్పారన్నది చూడాలంటే వేరే లెవెల్ ఆఫీస్ టీం తో తుపాకి.కాం చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడే మీరు చూసేయండి...
తెలుగు ఓటీటీ వేదికగా తెలుగులో చాలా ఒరిజినల్ వెబ్ సీరీస్ లు వస్తున్నాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఆహా తీసుకొస్తున్న వెబ్ సీరీస్ లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో ఆహా నుంచి వస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ వేరే లెవెల్ ఆఫీస్. ఆఫీస్ లో సీనియర్స్, జూనియర్స్ మధ్య జరిగే కథా నేపథ్యంతో ఈ వెబ్ సీరీస్ తెరకెక్కింది. ఈ సత్తిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సీరీస్ ఈ నెల 12న స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ వెబ్ సీరీస్ కు సంబందించి షూటింగ్ టైం లో జరిగిన విషయాల గురించి అందులో నటించిన అఖిల్ సార్ధక్, అఖిల్ వివాన్, కాజల్, వాసంతిక, రాజేష్ పాల్గొన్నారు. ఆ టీం తో తుపాకి.కాం స్పెషల్ చిట్ చాట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఆ నషా నుంచి బయటకు వచ్చి సినిమా చేసినా అది రిలీజ్ అవ్వకపోవడంతో ఆహా నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు చెప్పాడు అఖిల్ సార్ధక్.
ఇన్నాళ్లు ఆర్జేగా ఎవరికీ కనిపించకుండా వాయిస్ ఓవర్ తో అలరించిన కాజల్ బిగ్ బాస్ తో తెర మీదకు వచ్చింది. బిగ్ బాస్ తో పాపులర్ అయిన ఆమె కూడా ఫుల్ లెంగ్త్ రోల్ లో వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సీరీస్ చేసింది. ఈ సీరీస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేసిన కాజల్ కూడా ఈ సీరీస్ లో తన రోల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరితో పాటు వేరే లెవెల్ ఆఫీస్ గురించి ఈ యాక్టర్స్ ఏం చెప్పారన్నది చూడాలంటే వేరే లెవెల్ ఆఫీస్ టీం తో తుపాకి.కాం చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడే మీరు చూసేయండి...