రజినీ 'వేట్టయన్' ప్రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ మూవీ తర్వాత సినిమాల స్పీడ్ ను ఫుల్ గా పెంచిన విషయం తెలిసిందే.

Update: 2024-09-25 15:25 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ మూవీ తర్వాత సినిమాల స్పీడ్ ను ఫుల్ గా పెంచిన విషయం తెలిసిందే. ఏడు పదుల వయసులో కూడా ఎనర్జిటిక్ గా వరుస చిత్రాలు చేస్తున్నారు. షూటింగ్లను పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఎన్నడూ లేనంత స్పీడ్ గా షెడ్యూళ్లు ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పుడు వేట్టయన్- ది హంటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్‌ ఆ మూవీకి దర్శకత్వం వ‌హిస్తున్నారు.

యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న వేట్టయన్ మూవీని భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. రోబో 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జనీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో నాలుగో సినిమాగా వేట్టయన్ రాబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ మూవీలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుసారా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే మేకర్స్.. తాజాగా ప్రివ్యూ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిమినల్స్ ను రూత్ లెస్ గా ఎన్ కౌంటర్ చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి రజనీ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో లేటెస్ట్ గ్లింప్స్ ఫుల్ వైరల్ అవుతోంది.

ప్రివ్యూ ప్రకారం.. సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్).. టాప్ మోస్ట్ సీనియ‌ర్ ఎన్‌ కౌంట‌ర్ స్పెష‌లిస్టులు పిక్స్ చూపిస్తూ ట్రైనీ అధికారులకు పరిచయం చేస్తారు. అందులో రజినీ కూడా ఉంటారు. ఆ తర్వాత వేట్ట‌య‌న్ (ర‌జినీ) త‌న డ్యూటీలో వ్యవహరించిన తీరు.. ఎన్‌ కౌంట‌ర్స్ ఎలా చేశార‌నే సీన్స్ ను మధ్య మధ్యలో చూపించారు. రౌడీయిజం పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారిని హీరో వేటాడుతుంటాడని ప్రివ్యూ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఫ‌హాద్ ఫాజిల్, దుసారా విజ‌య‌న్‌, రానా ద‌గ్గుబాటి, అభిరామి, మంజు వారియ‌ర్‌ పాత్ర‌ల‌ను మేకర్స్ ప్రివ్యూ ద్వారా ప‌రిచ‌యం చేశారు. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటి లాగే అదరగొట్టేశారు. అయితే ఒక్క డైలాగ్ కూడా లేకున్నా.. ప్రివ్యూ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఆడియెన్స్‌ కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్‌ ను మూవీ ఇవ్వనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. మరి వేట్టయన్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News