రకుల్ పెళ్లి వీడియోగ్రఫర్ ఈయనే
తెలుగు-తమిళం-హిందీ పరిశ్రమల్లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో లైఫ్ లో సెటిల్ కాబోతున్న సంగతి తెలిసిందే
తెలుగు-తమిళం-హిందీ పరిశ్రమల్లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో లైఫ్ లో సెటిల్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రియుడు జాకీ భగ్నానీని రకుల్ పెళ్లాడుతోంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి పెళ్లి గోవాలో జరగనుంది.
తేదీ దగ్గర పడుతుండటంతో ఈ జంట పెళ్లి పనుల్లో మునిగితేలుతున్నారు. తాజా కథనాల ప్రకారం.. ఈ జంట తమ వివాహ వీడియో కోసం వీడియోగ్రాఫర్‌గా విశాల్ పంజాబీని ఎంచుకున్నారు. ఈ అందమైన జంట డి-డేను డాక్యుమెంట్ చేయడంతో పాటు ఈ జంట కోసం అద్భుతమైన థీమ్ ను కంపోజ్ చేస్తారు.
వీడియోగ్రాఫర్ విశాల్ సెలబ్రిటీ సర్కిల్స్ లో చాలా ఫేమస్. ఇంతకుముందు బాలీవుడ్లో అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె -రణవీర్ సింగ్ వంటి హై ప్రొఫైల్ వివాహాలకు వీడియోగ్రాఫర్ అతడే. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా జంట వివాహానికి కూడా అతడు ఫోటోగ్రఫీ ని అందించారు. గోవాలో జరగనున్న రకుల్ - భగ్నానీ జంట పెళ్లిని అతడు కవర్ చేస్తాడు. బీచ్ వెడ్డింగ్ చిల్లింగ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకుముందు రాత్రి రకుల్ - జాకీ ముంబైలోని ఓ ప్రయివేట్ ప్లేస్ లో జంటగా కనిపించారు.
ఒకే పరిశ్రమ కాబట్టి అర్థం చేసుకున్నాం:
జాకీ భగ్నానీతో తన అండర్ స్టాండింగ్ గురించి రకుల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పని కట్టుబాట్లు బిజీ షెడ్యూళ్ల కారణంగా ఒకరికొరు దూరమైనా కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉన్నామని అన్నారు. ఒకే పరిశ్రమ కాబట్టి ఇది సాధ్యమైందని కూడా రకుల్ అంగీకరించింది.
నేను చాలా ఇండిపెండెంట్ అమ్మాయిని అయినప్పటికీ, నా ఆఫ్ డేస్‌లో జాకీని ఉద్దేశించి మాట్లాడాలనుకునే రోజులున్నాయి. కానీ అతను అదే పరిశ్రమకు చెందినవాడు కాబట్టి అతను నా వృత్తిపరమైన సమస్యల్ని అర్థం చేసుకున్నాడు. భావోద్వేగ సమతుల్యత నేను వృత్తిపరంగా చేసే పనిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది! అని రకుల్ అంది.
తాను జాకీ ఎప్పుడూ పని గురించి చర్చించుకోమని. బ్యాలెన్స్‌ను కొనసాగించడానికి ఇష్టపడతామని రకుల్ వెల్లడించింది. మేం వర్క్హోలిక్ .. ఫిట్నెస్ను కూడా ఇష్టపడతామని రకుల్ తెలిపింది. కాబట్టి వారి సంభాషణలు ప్రధానంగా వ్యాయామాలు, ఆహారం, ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి ఉంటాయి. తామిద్దరం సాధారణంగా రోజుకు 12 గంటలు పనిచేస్తున్నామని రకుల్ తెలిపారు.