హస్కీ వాయిస్‌ లేడీ.. సూపర్ బ్రేక్‌

Update: 2015-11-19 05:35 GMT

Full View
శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో హీరోయిన్ కమలినీ ముఖర్జీ పక్కన ఆమె ఫ్రెండ్ రోల్ చేసిన హస్కీ వాయిస్‌ లేడీ సత్య కృష్ణ.. ఇప్పుడు రవి బాబుకు జంటగా నటిస్తోంది. ఈ నెల 27న రిలీజ్ కానున్న తను నేను మూవీలో.. వీళ్లిద్దరి కేరక్టర్లను పరిచయం  చేస్తూ ప్రోమోలు రిలీజ్ చేసింది యూనిట్.

కూతురుని అమెరికా పంపించడమే టార్గెట్ అయిన హీరోయిన్ తండ్రి సర్వేశ్వరరావు పాత్రలో రవిబాబు ఇరగదీసేశాడు. హీరోయిన్ తల్లిగా కంటే - శాడిస్ట్ భర్త టార్చర్ ని మనసులోనే తిట్టుకుంటూ ఉండే భార్య పాత్ర సత్యకృష్ణది. వీళ్ల మధ్య డైలాగ్స్ కూడా భలే ఫన్నీగా కుదిరాయి. ' మొగుడిని ముక్కలుగా నరికి రైల్వే స్టేషన్ లో వదిలారట, వీడిని ఎయిర్ పోర్ట్ లో వదలాలి' అని భవాని పాత్రధారి సత్యకృష్ణ అనుకుంటుంది. దీన్ని పసిగట్టిన రవిబాబు 'పేపర్ నేనూ చదివాను, నన్ను నరకలేవు, ఎందుకంటే నాది థిక్ స్కిన్' అంటాడు. ఇలా భార్య మనస్సులో అనుకున్నవి కూడా కనిపెట్టేస్తాడు సర్వేశ్వరరావు. మొత్తానికి ఈ సినిమాతో హస్కీ వాయిస్‌ సత్య కృష్ణకు భారీ బ్రేక్‌ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటివరకు కేవలం గుంపులో గోవిందం రోల్స్‌ లో ఎక్కువగా కనిపించిన ఈమె.. ఇక నుంచి ఆథర్‌ బ్యాకెడ్‌ రోల్స్‌ లో మెరుస్తుందేమో.

తను నేనులో సంతోష్ శోభన్ హీరోగా పరిచయం అవవుతుండగా, అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ మోహన్ డైరెక్టర్ కాగా.. సురేష్ బాబు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ట్రైలర్ - టీజర్ ప్రామిసింగ్ ఉండడంతోపాటు.. భిన్నంగా కనిపిస్తుండడంతో.. తనునేనుపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. సురేష్ మూవీస్ ఎంట్రీతో ఈ ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.  
Tags:    

Similar News