రూ.5 కోట్లు అనుకున్న బడ్జెట్‌ రూ.65 కోట్లకి..!

ఒక వేళ విడుదల సినిమా కనుక ఫ్లాప్ అయ్యి ఉంటే నిర్మాతకు ఏకంగా 60 కోట్ల నష్టం వాటిల్లేది అంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2023-12-10 04:15 GMT

ఒక సినిమా ప్రారంభించిన సమయంలో అనుకున్న బడ్జెట్‌ కి, సినిమా పూర్తి అయ్యేప్పటికి అయిన బడ్జెట్‌ కి కచ్చితంగా తేడా ఉంటుంది. చిన్న సినిమాలు అయితే ఆ తేడా ఒకటి రెండు కోట్లు ఉండవచ్చు.. పెద్ద సినిమాలు అయితే అయిదు లేదా పది కోట్లు మహా అయితే పాతిక కోట్లు పెరిగి ఉండవచ్చు. కానీ ఏకంగా 60 కోట్ల బడ్జెట్‌ పెరిగిన సినిమా గురించి మీకు తెలుసా..!

ఆ వివరాల్లోకి వెళ్లితే.. తమిళ కల్ట్ డైరెక్టర్‌ వెట్రిమారన్ ఈ ఏడాది సమ్మర్ లో 'విడుదల' పార్ట్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాను సూరి హీరోగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌ అనుకుని మొదలు పెట్టాడు. విజయ్ సేతుపతి ని కేవలం 10 రోజుల డేట్లు అడిగిన వెట్రిమాన్‌ సినిమా మొత్తంను 30 నుంచి 35 వర్కింగ్ డేస్ లో ముగించాలని భావించాడు.

సినిమా మొదలు పెట్టడం కోసం ఒక కొండ మీద విలేజ్ సెట్‌ వేయడంతో పాటు కొండ కింద ఉన్న గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు గాను దాదాపుగా మూడున్నర కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మిగిలిన మొత్తంతో షూటింగ్‌ చేద్దామని అనుకున్నారు. కానీ భారీ వర్షాల కారణంగా కొండ మీద వేసిన విలేజ్ సెట్‌ దాదాపు 90 శాతం కొట్టుకు పోయింది.

కథ మరియు వెట్రిమారన్‌ పై నమ్మకంతో నిర్మాతలు మళ్లీ మొదటి నుంచి పనులు మొదలు పెట్టమన్నారట. దాంతో కొత్త సెట్‌ నిర్మించి, మళ్లీ షూటింగ్‌ కి ఏర్పాట్లు చేశారు. అలా విడుదల సినిమాకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉండేదట. సినిమా పూర్తి అయ్యే సమయంకు అయిదు కోట్లు అనుకున్న బడ్జెట్‌ కాస్త ఏకంగా రూ.65 కోట్లకు చేరిందట.

విడుదల సినిమా గురించి దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల ఒక రౌండ్ టేబుల్‌ చిట్ చాట్ లో ఈ విషయాన్ని స్వయంగా వెళ్లడించాడు. ఒక వేళ విడుదల సినిమా కనుక ఫ్లాప్ అయ్యి ఉంటే నిర్మాతకు ఏకంగా 60 కోట్ల నష్టం వాటిల్లేది అంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు. విడుదల పార్ట్‌ 2 కి ఉన్న బజ్ నేపథ్యం లో వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదల పార్ట్‌ 2 లో విజయ్‌ సేతుపతి కీలకంగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

Tags:    

Similar News