దర్శకుడు 42 రోజులు ఒకే నిక్కరుతో ఉన్నాడు!
ఇదిలా ఉంటే తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో విద్యాబాలన్ ఒక ప్రముఖ దర్శకుడి మూడ నమ్మకం గురించి వ్యాఖ్యానించారు.
విద్యాబాలన్ నటించిన తాజా చిత్రం 'దో ఔర్ దో ప్యార్' విడుదలై మంచి సమీక్షలను అందుకుంది. హార్ట్‌బ్రేక్, అపనమ్మకం, మోడ్రన్ డే పెళ్లిళ్లను జంటలు ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? వంటి బోల్డ్ విషయాలను తెరపై ఆవిష్కరించారు. విద్య బాలన్- ప్రతీక్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటైందని ఇప్పటికే సోషల్ మీడియాల్లో ప్రశంసలు కురిసాయి.
వివాహిత జంటలు కలిసే ఉన్నా ఒంటరితనం అనుభవిస్తున్నారు. వారి మధ్య ప్రేమ, దుర్బలత్వం గురించిన ప్రశ్నలు ఎన్నో. ఈ సిరీస్ చాలా జంటలకు ఒక ప్రశ్న రేకెత్తించే గుర్తుగా మిగిలిపోతుంది. ప్రేమ, అభిరుచి తాలూకా ప్రయాణం, సమాజం -వివాహం వంటి సంక్లిష్టతలతో తెరకెక్కిన సినిమా ఇది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో విద్యాబాలన్ ఒక ప్రముఖ దర్శకుడి మూడ నమ్మకం గురించి వ్యాఖ్యానించారు. అతడు తనకు ఉన్న మూఢ నమ్మకం కారణంగా ఏకంగా 42 రోజులు ఒకే షార్ట్ (నిక్కరు) ధరించి సెట్స్ కి వచ్చాడని, అది వేరొకరి ద్వారా తనకు తెలిసి ఆశ్చర్యపోయానని బాలన్ తెలిపారు.
అతడు ఎలా వచ్చినా తాను మాత్రం అది పట్టించుకోలేదని బాలన్ తెలిపారు. ఇదంతా విజయం దక్కాలని చేసాడు. కానీ ఆ సినిమా డిజాస్టరైందని బాలన్ తెలిపారు. ఆ దర్శకుడెవరు అనేది అప్రస్తుతం. ఇలాంటి వారిని పరిశ్రమలో ఎందరినో చూసానని తెలిపారు.
ఒక దర్శకుడు తన జాతకం దురదృష్ట జాతకమని, అందుకే సినిమా నుంచి తొలగించినట్టు తెలిసి బాధపడ్డానని విద్యాబాలన్ అన్నారు. మూఢ నమ్మకాలతో నన్ను బాధపెట్టిన దర్శకులు నిర్మాతలు చాలామంది ఉన్నారని బాలన్ తెలిపారు.