భర్తకు హీరోయిన్ రొమాంటిక్ గా బర్త్ డే విషెష్
లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా జవాన్ సినిమా తో హిందీలో అడుగు పెట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే
లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా జవాన్ సినిమా తో హిందీలో అడుగు పెట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఇప్పటికి కూడా నయనతార ఓ రేంజ్ లో దూసుకు పోతున్న సమయంలోనే విఘ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న నయనతార చాలా కాలం పాటు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఇద్దరి ప్రేమ విషయం గురించి చాలా కాలం మీడియాలో తెగ ప్రచారం జరిగింది. పెళ్లి వార్తలు ఎన్ని వచ్చినా కూడా వారు స్పందించలేదు. ఇద్దరు పెళ్లి చేసుకుని సడెన్ గా తల్లిదండ్రులం అయ్యామని కూడా అధికారికంగా ప్రకటించారు.
గతంలో నయనతార ప్రేమ విషయాల నేపథ్యం లో విఘ్నేష్ శివన్ తో ఆమె ప్రేమ, పెళ్లి బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనుమానాలన్నింటిని కూడా పటాపంచలు చేస్తూ నయనతార తమ వైవాహిక బంధం ను చాలా సంతోషంగా సాగిస్తోంది. రెగ్యులర్ గా తన భర్తతో ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వచ్చింది.
తాజాగా విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా రొమాంటిక్ ఫోటో ను షేర్ చేయడం తో పాటు అతడిపై ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో పంచుకుంది. ఇన్ స్టా లో ఆమె షేర్ చేసిన ఫోటోలు మరియు కామెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో నయనతార అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.
ఇన్ స్టా లో నయనతార... నా ప్రియమైన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ గురించి చాలా చాలా రాయాలని అనుకుంటున్నాను. రాయడం ప్రారంభిస్తే కొన్ని విషయాలతో ఆగిపోవచ్చని నేను అనుకోను. నువ్వు నాపై చూపించే ప్రేమ ను ఎప్పటికి మర్చిపోలేను. మన సంబంధం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నా జీవితంలోకి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నా కలల సాకారంలో ఎప్పుడు నీ సహకారం ఉండటం సంతోషం. నీవు చేసే ప్రతి పనిలో కూడా ఉత్తమంగా ప్రదర్శణ కనబర్చుతున్నావు. నువ్వు చాలా సంతోషంగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొంది.