దేవరకొండ.. ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే..

చివరిగా విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఊహించని ఫలితాన్నీ అందుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-30 09:28 GMT

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరికొన్ని డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రాబోయే సినిమాలతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. చివరిగా విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఊహించని ఫలితాన్నీ అందుకున్న విషయం తెలిసిందే.

అయినప్పటికీ తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఈ హీరో తదుపరి సినిమా కోసం ఎంతో బలంగా సిద్ధమవుతున్నాడు. అంతకుముందు కూడా లైగర్ తో నిరాశను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా కానిస్టేబుల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. అలాగే ఒక ఖైదీగా కూడా అతను ఈ సినిమాలో నట విశ్వరూపం చూపిస్తాడు అని టాక్ అయితే వినిపిస్తుంది. దానికోసం ప్రత్యేకంగా ఒక లుక్ కూడా సెట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అయితే విజయ్ బయట ఎక్కడ కనిపించినా కూడా టోపీతో కనిపిస్తూ ఉన్నాడు.

తన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అనే విషయంలో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అంతే కాకుండా గడ్డం కూడా గట్టిగా పెంచాడు. ఏదో హై వోల్టేజ్ క్యారెక్టర్ అతని నుంచి రాబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఇటీవల మరి కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు. నిన్న మొన్నటి వరకు వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నాడు.

స్విమ్మింగ్ పూల్ లో అలా సేదతీరుతూ కనిపించాడు. అలాగే మరికొన్ని స్టిల్స్ లో అతను టోపీ పెట్టుకునే కనిపించాడు. ఇది టోపీ దశ అంటూ.. ఏదో సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పట్లో విజయ్ తన పూర్తి లుక్ లో కనిపించేలా లేడు అనిపిస్తుంది. ఇక గౌతమ్ సినిమాతో పాటు విజయ్, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News