దేవరకొండ సినిమాకి కేజీఎఫ్ ఎలివేషన్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ మూవీ చేస్తున్నాడు.

Update: 2024-10-14 05:18 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో గౌతమ్ ఉన్నారు. మూవీలో విజయ్ దేవరకొండ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇటీవల ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మూవీ అక్టోబర్ 31 థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పనిలో పనిగా రాబోయే సినిమాల గురించి కూడా చెబుతూ ‘VD 12’ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ దేవరకొండ మూవీ సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు ఏంటి అని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అడిగారు. గౌతమ్ స్టైల్ అంతే కదా అని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే మూవీ ఎలా ఉండబోతోంది అని మరల జర్నలిస్ట్ ప్రశ్నించారు. గౌతమ్ స్టైల్ లో కేజీఎఫ్ లాంటి జోనర్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో VD 12 మూవీ అలా ఉంటుంది. కచ్చితంగా కొత్తగా ఉండబోతోంది అని నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి హిట్ ఇస్తామని మాటిచ్చారా అని జర్నలిస్ట్ అడిగారు.

అర్జున్ రెడ్డి, గీతగోవిదం లాంటి సినిమాలు చేసిన హీరోకి నేను మాటివ్వడం ఏంటి సర్. నాకు గౌతమ్ మీద నమ్మకం ఎక్కువ. కచ్చితంగా అతను ఓ మంచి సినిమా చేస్తాడు అని నాగవంశీ చెప్పారు. ఇదిలా ఉంటే రౌడీ స్టార్ ఫ్యాన్స్ కూడా ‘VD 12’ మూవీపైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండకి ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ పడలేదు. దీంతో మరల తన స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. క్యారెక్టరైజేషన్ పరంగా కూడా డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు రెగ్యులర్ గా పక్కింటి కుర్రాడి తరహా పాత్రలని విజయ్ చేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం ఏదో కొత్తగానే చూపించే ప్రయత్నంలో ఉన్నారు. దీని తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ సినిమాని విజయ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

Tags:    

Similar News