విజయ్ సేతుపతి.. బిగ్ బాస్ రేటు గట్టిగానే..

తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా గతంలో కమల్ హాసన్ ఉండేవారు.

Update: 2024-09-09 04:19 GMT

తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా గతంలో కమల్ హాసన్ ఉండేవారు. మొదటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 మొదలయ్యింది. ఈ సీజన్ నుంచి హోస్ట్ గా కమల్ హాసన్ తప్పుకున్నారు. ఓ విధంగా కంప్లీట్ గా బిగ్ బాస్ షోని కమల్ హాసన్ వదిలేశారు. దీంతో ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా విజయ్ సేతుపతి రంగంలోకి వచ్చారు.

స్టార్ విజయ్ ఛానల్ లో అక్టోబర్ 6 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. మొదటి సారి విజయ్ సేతుపతి బిగ్ బాస్ షో కోసం హోస్ట్ అవతారం ఎత్తారు. ఇక ఈయనకి బిగ్ బాస్ నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసారంట. ఆయన శని, ఆదివారాలు ఎపిసోడ్స్ లో హోస్ట్ గా కనిపించనున్నారు. 100 రోజుల పాటు జరిగే ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు ఏకంగా 60 కోట్ల రెమ్యునరేషన్ విజయ్ సేతుపతికి ఇస్తున్నారంట.

నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. విజయ్ మార్కెట్ రేంజ్ బట్టి అతను ఒక్కో సినిమాకి 15 నుంచి 20 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాలకి నెలలు, సంవత్సరాల తరబడి డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయిన కూడా ఆయన రెమ్యునరేషన్ మీడియం రేంజ్ లోనే ఉంది. అయితే బిగ్ బాస్ షోకి మాత్రం తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే మూడు రెట్లు అధికంగా విజయ్ సేతుపతి తీసుకుంటున్నాడు.

ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. కమల్ హాసన్ అయితే ఏడు సీజన్స్ ని తనదైన శైలిలో సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ షోకి ఏ విధంగా ముందుకి తీసుకొని వెళ్తాడో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి ఈ ఏడాది మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తోన్న విడుదలై 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే గాంధీ టాక్స్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రయోగాత్మక కథాంశంతో గాంధీ టాక్స్ సినిమా తెరకెక్కుతోందంట. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8ని కింగ్ నాగార్జున సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. ఆయనకి కూడా నిర్వాహకులు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News