ఆమెని మాత్రం మా ఆయనకి భార్యని చేయోద్దు!
ఈ నేపథ్యంలో తాజాగా విజయలక్ష్మి బెంగుళూరు పోలీస్ కమీషనర్ కు ఓ లేఖ రాసారు. 'పవిత్రని దర్శన్ భార్య అని అనొద్దు. చట్ట ప్రకారం దర్శన్ కి నేను మాత్రమే భార్యను.
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన్ అగ్రహారం జైలులో ఉన్నాడు. ఆయనతో పాటు ప్రియురాలు పవిత్రా గౌడ్ కూడా అదే జైలులో ఉంది. దీంతో భర్తను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని దర్శన్ భార్య విజయలక్ష్మి తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దర్శన్ జైలుకెళ్లిన నాటి నుంచి ఆమె అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు దరన్-పవిత్ర గురించి కన్నడ మీడియా ప్రత్యేక కథనాలు అంతే హీటెక్కిస్తున్నాయి. దర్శన్, పవిత్రల్ని భార్య భర్తల్ని సైతం చేసేసాయి. అలాగే కొందరు పోలీస్ అధికారులు కూడా వాళ్లిద్దర్నీ భార్య భర్తలుగానే పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయలక్ష్మి బెంగుళూరు పోలీస్ కమీషనర్ కు ఓ లేఖ రాసారు. 'పవిత్రని దర్శన్ భార్య అని అనొద్దు. చట్ట ప్రకారం దర్శన్ కి నేను మాత్రమే భార్యను.
కానీ మీరు, రాష్ట్ర హోమంత్రి, మీడియా అంతా పవిత్రని నా భర్త భార్యగా చెబుతున్నారు. ఇది నన్ను ఎంతో బాధిస్తుంది. నా బిడ్డకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి పోలీస్, కోర్టు రికార్డుల్లో ఎక్కడా దర్శన్ భార్యగా పవిత్ర పేరు రాయోద్దు' అని కమీషనర్ కి రాసిన లేఖలో ఉంది. దీంతో దర్శన్ అంటే భార్య విజయలక్ష్మి కి ఎంతో ప్రేమ అన్నది మరోసారి ప్రూవ్ అయింది.
పవిత్రని భార్య అంటేనే విజయలక్ష్మి తట్టుకోలేకపోతుందని స్ఫష్టమవుతుంది. అయితే అదే ప్రియురాలి కోసం దర్శన్ హత్య చేయడం ఎంత వరకూ న్యాయమో కూడా విజయలక్ష్మి చెప్పాలని నెటి జనులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విజయలక్ష్మి బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దర్శన్ ని అరెస్ట్ చేసిన నాటి నుంచి బెయిల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఇంతవరకూ సాధ్యపడలేదు.