బాలయ్యకి అందుకే నో చెప్పానంటోన్న సీనియర్!
ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ కాంబినేషన్ గా ముద్ర పడింది.
నటసింహ బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ అప్పట్లో ఎంత సంచలనమో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్లు ఆ కాంబినేషన్ లో సాధ్యమయ్యాయి. ఆ కలయిక వెండి తెరకే వన్నే తీసుకొచ్చిన జోడీ అది. ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ కాంబినేషన్ గా ముద్ర పడింది. 17 సినిమాల్లో 2 సినిమాలు మినహా అన్ని విజయాలే.
'కథానాయకుడు' , 'పట్టాభిషేఖం', 'ముద్దుల కృష్ణయ్య', 'దేశోద్ధారకుడు', 'భార్గవ రాముడు', 'సాహస సామ్రాట్', 'మువ్వగోపాలుడు' , 'భానుమతిగారి మొగుడు', 'ఇన్స్పెక్టర్ ప్రతాప్', 'భలేదొంగ' , 'ముద్దుల మామయ్యా', 'ముద్దుల మేనల్లుడు', 'లారీ డ్రైవర్', 'తల్లిదండ్రులు', 'రౌడీ ఇన్స్పెక్టర్' మంచి విజయం సాధించాయి. చివరిగా నిప్పురవ్వలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఆకాంబినేషన్ లో సినిమా తెరకెక్కలేదు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం కారణంగానూ కలిసి సినిమాలు చేయలేదని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. తాజాగా ఈ విషయంపై విజయశాంతి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. 'నిప్పురవ్వ' తర్వాత నటించకపోవడానికి వేరే కారణాలంటూ ఏవీ లేవు. ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వరుసగా సైన్ చేయడం, ఆ తరహా కథలే నాకు రావడం ఎక్కువైంది.
ఆ సినిమాలు కూడా ఒక హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడాయి. అప్పుడు నేను తీసుకున్న పారితోషికం కూడా ఎక్కువ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ , యాక్షన్ సినిమాలు చేస్తాననీ , అంత బిజీ అవుతానని నేనే అనుకోలేదు. అందువల్లనే ఇతర హీరోలతో చేయలేకపోయాను' అని అన్నారు. బాలకృష్ణతోనే కాదు అప్పట్లో ఫామ్ లో ఉన్న ఏ హీరోతోనూ విజయశాంతి అంత యాక్టివ్ గా సినిమాలు చేయలేదు. బాక్సాఫీస్ వద్ద సోలోగానే సత్తా చాటింది. చాలా కాలం పాటు ఆ తరహా సినిమాలు చేసింది. సినిమాల నుంచి రిటైర్మ్ంట్ కూడా వాటితోనే జరిగింది. చాలా కాలం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'లో పాత్ర నచ్చడంతో చేసింది. కానీ తర్వాత మళ్లీ కొనసాగలేదు.